ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, పలువురు ప్రముఖుల సంతాపం

Veteran Bollywood Actor Vikram Gokhale Passes Away Several Celebrities Extends Mourn,Popular Bollywood Actor,Vikram Gokhale Passed Away, Bollywood Celebrities Mourned,Mango News,Mango News Telugu,Several Celebrities Extends Mourn,Bollywood Actor Vikram Gokhale,Vikram Gokhale Movies,Vikram Gokhale Latest Movies,Vikram Gokhale Latest News and Updates,Veteran Bollywood Actor Vikram Gokhale,Bollywood Actor Vikram Gokhale

ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే శనివారం మధ్యాహ్నం పూణెలో మరణించారు. 77 యేళ్ల గోఖలే వివిధ అవయవాల వైఫల్యం కారణంగా మరణించారని ఆయనకు చికిత్స అందిస్తున్న దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా గోఖలే లైఫ్ సపోర్టులో ఉన్నారని, శనివారం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. విక్రమ్ గోఖలే భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు బాల గంధర్వ సబగృహ వద్ద కొద్దిసేపు అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. ఇక ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం 6 గంటలకు పూణెలోని వైకుంఠ శ్మశానవాటికలో జరుపనున్నట్లు వారు వెల్లడించారు. కాగా ఈ వారం ప్రారంభంలో విక్రమ్ గోఖలే మరణం గురించి సోషల్ మీడియాలో పుకార్లు రాగా, దానిని అతని కుమార్తె ఖండించింది. విక్రమ్ తండ్రి చంద్రకాంత్ గోఖలే కూడా పలు హిందీ చిత్రాల్లో నటించడం గమనార్హం.

ఇక రంగస్థల నటుడైన విక్రమ్ గోఖలే 1971లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పర్వానా’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో కీలక పత్రాలు ధరించారు. అమితాబ్ బచ్చన్ యొక్క మరొక హిట్ సినిమా ‘అగ్నిపథ్’, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అజయ్ దేవగన్ నటించిన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్‌’లో నటించి మెప్పించారు. అలాగే గోఖలే పలు మరాఠీ చిత్రాలలో కూడా నటించారు. ఇటీవలి కాలంలో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’, హిచ్కీ, అయ్యారి, బ్యాంగ్ బ్యాంగ్!, దే దానా దాన్ మరియు భూల్ భులైయా వంటి అనేక ఇతర చిత్రాలలో నటించారు. 2010లో మరాఠీ చిత్రం అనుమతిలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఆయన ‘ఆఘాత్‌’ అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. 40 ఏళ్లకు పైగా సాగిన కెరీర్‌లో ఆయన అనేక టీవీ షోలలో కూడా నటించారు. కాగా విక్రమ్ గోఖలే మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 13 =