వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం’, హాజరవనున్న సీఎం జగన్

YSRCP BC Leaders Announces BCs Athmeeya Sammelan To be Held on December 8 CM Jagan Likely To Attend,BCs Athmeeya Sammelan,CM Jagan Attednding,Spiritual Gathering of BCs, Jagan YSRCP,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో బీసీల సమావేశం జరుగనుంది. డిసెంబర్ 8న జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ బీసీ నాయకులు ప్రకటన చేశారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీలోని పలువురు బీసీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్, జయరాం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు మోపిదేవి, పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

భేటీ అనంతరం బీసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 8న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించటానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమావేశానికి 10వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని, అలాగే ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని, రాజకీయంగా కూడా పలువురు నేతలకు అవకాశాలిచ్చిందని వివరించారు. ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించడానికి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. కాగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఇప్పటినుంచే రాష్ట్రంలోని బీసీలను దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా దీనిని నిర్వహించనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here