‘ఇస్రో’ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై గూఢచర్యం కేసు.. కీల‌క తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

ISRO Scientist Nambi Narayanan Espionage Case SC Quashes Kerala HC Order Granting Anticipatory Bail To 4 Accused,Espionage Case Against ISRO,ISRO Scientist Nambi Narayanan,Scientist Nambi Narayanan,Supreme Court Verdict On Nambi Narayanan,Mango News,Mango News Telugu,ISRO Latest News and Updates,ISRO News and Live Updates,Nambi Narayanan,Nambi Narayanan News and Updates,Vikas Rocket Engine,Rocket Engines,Liquid Propulsion Systems,Chemical Pressurisation System,Vikas Rocket Engine Cryogenic Engine,Vikas Cryogenic Engine

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ఇస్రో) గూఢచర్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సహా నలుగురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. కాగా 1994లో ఇస్రో గూఢచర్యం విషయంలో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఇరికించారని ఆరోపించిన కేసులో వారికి బెయిల్ లభించింది. గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌, కేరళకు చెందిన ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఎస్‌ విజయన్‌, థంపి ఎస్‌ దుర్గాదత్‌, రిటైర్డ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి పీఎస్‌ జయప్రకాశ్‌లకు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ చేసిన అప్పీల్‌పై తాజా తీర్పు వెలువడడం గమనార్హం.

కోర్టు బెయిల్ దరఖాస్తులను తిరిగి హైకోర్టుకు పంపింది, వీలైనంత త్వరగా-కనీసం నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇక ఈ కేసుపై హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు, విచారణలో వారి సహాయానికి బదులుగా సుప్రీంకోర్టు ఐదు వారాల పాటు అరెస్టు చేయకుండా నిందితులకు రక్షణ కల్పించింది.ఇక దీనిలో నారాయణన్ సహా ఇద్దరు శాస్త్రవేత్తలు, మరో ఇద్దరు మాల్దీవుల మహిళలతో కలిసి మొత్తం నలుగురు భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను విదేశాలకు బదిలీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ కేసును తొలుత రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి, ఆ తర్వాత సీబీఐకి అప్పగించారు. అయితే సీబీఐ దర్యాప్తులో గూఢచర్యం జరగలేదని తేలింది. అయితే ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇక ఈ కేసు వ్యవహారం రాజకీయంగా కూడా అనేక విమర్శలకు తావిచ్చింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత కే కరుణాకరన్‌ రాజీనామా కూడా చేయవలసి వచ్చింది. 1998లో, ఈ కేసులో విడుదలైన నారాయణన్‌తో పాటు ఇతరులకు రూ.లక్ష నష్ట పరిహారం మంజూరు చేస్తూ, ఆ మొత్తాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత తాను అనుభవించిన మానసిక వేదనకు, చిత్రహింసలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతూ నారాయణన్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌సి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత, ఏప్రిల్ 29, 1998 నాటి సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని మార్చి 2001లో అతనికి రూ. 10 లక్షల మధ్యంతర పరిహారాన్ని అందించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =