జేఈఈ మెయిన్-2023: సెషన్ 2 ఫలితాలు విడుదల చేసిన ఎన్‌టీఏ, అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో

JEE Main 2023 NTA Released Session 2 Results Today Download Scorecard at jeemain nta nic in,JEE Main 2023 NTA Released Session 2 Results Today,JEE Main 2023 Results Download Scorecard at jeemain nta nic in,JEE Main Session 2 Results Today Download Scorecard,Mango News,Mango News Telugu,JEE Main Result 2023 Live,JEE Mains Session 2 Result declared,JEE Main 2023 result date,JEE Main Session 2 Result 2023 Live Updates,JEE main result declared at jeemain,JEE Main 2023 Latest News and Updates,JEE Main 2023 Live News

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ మెయిన్) 2023, రెండవ విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం ఉదయం సెషన్ 2 ఫలితాలను విడుదల చేసింది. కాగా పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో తమ ఫలితాలను పొందవచ్చని సూచించింది. దీనికోసం వారు తమ అప్లికేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలకు సంబంధించిన తమ స్కోర్‌కార్డ్‌ని ఈ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. జేఈఈ మెయిన్ రెండవ విడత పరీక్షను దాదాపు 9 లక్షల మంది రాశారు.

కాగా ఈ ఏడాది జేఈఈని రెండు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలివిడతలో పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఈ సెషన్ 2 పరీక్ష రాయవచ్చని ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2023 రెండవ విడత ఏప్రిల్ 6, 8, 10, 11 మరియు 12 తేదీల్లో నిర్వహించారు. పరీక్షకు రిజర్వ్ తేదీలు ఏప్రిల్ 13 మరియు 15 కాగా.. సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయింది. దేశవ్యాప్తంగా జనవరి 24, 25, 28, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు సుమారు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విదార్థులు హాజరయ్యారు. వీటిలో పేపర్ 1 (బీఈ/బీటెక్ కోర్సులు) పరీక్షను 6.24 లక్షల మంది రాయగా.. పేపర్ 2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్షను 2 లక్షల మంది విదార్థులు రాశారు. ఇక జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 95.8 శాతంతో అత్యధిక హాజరును నమోదు చేసింది.

ఇక తుది ఫలితాల అనంతరం ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటిస్తుంది. దీనిలో మొదటి 2.5 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు అనుమతి లభిస్తుంది. ఈ నెల 30 నుంచి జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, అలాగే మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా.. మే 8 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. ఇక మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పరీక్ష జూన్ 4న జరుగుతుందని వెల్లడించింది. కాగా ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ జూన్ 11న, ఫలితాలను జూన్ 18న విడుడల చేయనున్నట్లు తెలియజేసింది. చివరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు వంటి విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవనుండగా.. అడ్మిషన్ల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఎన్‌టీఏ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =