వేర్వేరు పార్టీల నుంచి నువ్వా నేనా అంటున్న బ్రదర్స్

Bosele Brothers Competition from Different Parties,Bosele Brothers Competition,Competition from Different Parties,Bosele Brothers,Mango News,Mango News Telugu,Bosele Narayanarao Patel, Bosele Mohanrao Patel, Brothers in Mudhol, Bosele Brothers, Big Brother 25 Adds Drama,Super Siblings,Competition,Different Parties,Pawar Rama Rao Patel,Bosele Brothers Latest News,Bosele Brothers Latest Updates,Bosele Brothers Live News
Bosele Narayanarao Patel, Bosele Mohanrao Patel, brothers in Mudhol, Bosele brothers, competition,different parties,Pawar Rama Rao Patel

ఎన్నికలు వస్తున్నాయంటేనే ఎన్ని సిత్రాలు చూడాలో ఈ సారి అని ఓటర్లు కామెంట్లు చేస్తుంటారు. మిత్రులు శత్రువులు అవుతారు.. శత్రువులు అలయ్ బలయ్ అని ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఒక కుటుంబంలోనే ప్రత్యర్థులుగా మారి ఎన్నికల బరిలో దిగేవాళ్లూ ఉంటారు. నిన్నమొన్నటి వరకూ ఒక లెక్క ఎన్నికలు వచ్చేముందు ఒక లెక్క అన్నట్లుగా పొలిటికల్ సినారియోలు మారిపోతూ ఉంటాయి. తాజాగా ముధోల్  అసెంబ్లీ బరిలో నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారారు.

 

భైంసా మండలం బడ్‌గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావు పటేల్‌, కమలాబాయి దంపతుల కుమారులైన బోస్లే నారాయణరావు పటేల్‌, బోస్లే మోహన్‌రావు పటేల్‌ ..భైంసాలో జిన్నింగ్‌ ఫ్యాక్టరీ నడిపే వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1994లో ఎన్నికలు జరిగినపుడు టీడీపీ నుంచి మొదటిసారి బరిలో దిగిన నారాయణరావు పటేల్‌.. అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డెన్నపై విజయం సాధించారు. అలాగే పవార్‌ శ్యాంరావు పటేల్‌, రాధాబాయి కొడుకైన పవార్‌ రామారావు పటేల్‌.. వీరిద్దరికీ వరుసకు సోదరుడు అవుతాడు. అలా అక్కాచెల్లెళ్ల  పిల్లలైన ఈ ముగ్గురు కలిసి వ్యాపారాలు చేసేవారు. ఒకేచోట వ్యాపారాలు చేసుకుంటున్న వీరంతా.. వేరు వేరు రాజకీయ పార్టీలలో చేరి ప్రస్తుతం ప్రత్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు.

 

అలా ఈసారి ముధోల్‌ అసెంబ్లీ బరిలో ఈ ఇద్దరు అన్నదమ్ములు నిలుస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవార్‌ రామారావు పటేల్‌ నిలబడగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోస్లే నారాయణరావు పటేల్‌ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికలలోనూ కూడా ఈ  ఇద్దరు అన్నదమ్ముళ్లు బరిలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పవార్‌ రామారావుపటేల్‌ నిలబడగా..నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బోస్లే నారాయణరావు పటేల్‌లు బరిలో నిలబడ్డారు. అయితే 2018 ఎన్నికల్లో బోస్లే నారాయణరావు పటేల్‌, బోస్లే మోహన్‌రావు పటేల్‌.. నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున  ప్రచారానికి వెళ్లారు.కానీ 2023 ఎన్నికల్లో బోస్లే మోహన్‌రావు పటేల్‌.. పవార్‌ రామారావు పటేల్‌కు మద్దతు తెలుపుతున్నారు.

 

అయితే 1994 ఎన్నికల సమయం నుంచి 2009 ఎన్నికల వరకు ముగ్గురు అన్నదమ్ముళ్లు ఒకే మాటగా  ఉండేవారు. 1994 ఎన్నికల్లో బోస్లే నారాయణరావు పటేల్‌ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో వ్యాపారాలు పవార్‌ రామారావు పటేల్‌, బోస్లే మోహన్‌రావు పటేల్‌ చూసుకునేవారు. అలా  ఆ ముగ్గురు అన్నదమ్ముళ్లు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉండేవారు. అయితే గడిచిన పదేళ్లలో రాజకీయ వైరుధ్యాలతో వేరువేరుగా  పోటీ చేస్తున్నారు. అన్నదమ్ములు అయి ఉండీ  ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =