నియాకోవ్ వైరస్ పై మరింత అధ్యయనం అవసరం – డబ్ల్యూహెవో

Covid New Variant, Covid New Variant NeoCov, Further Study is Needed on NeoCov Virus, Is NeoCov Coronavirus Dangerous for Humans, Mango News, NeoCov Coronavirus, NeoCov Coronavirus Discovered By Chinese Scientists, NeoCov Coronavirus Requires Further Study, NeoCov’s potential danger to humans, NeoCov’s potential danger to humans needs further study, WHO, WHO Further Study is Needed on NeoCov Virus, WHO on NeoCov, WHO on NeoCov threat to humans

కరోనా వైరస్ ‘ఒమిక్రాన్’ రూపంలో మరోసారి ప్రపంచాన్ని కలవరపాటుకి గురి చేస్తోన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. కరోనా వైరస్ కొత్త మ్యుటెంట్లు ఒక దాని తర్వాత ఒకటి పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రాణాంతకమైన మరో కొత్తరకం వేరియంట్‌ ‘నియో కోవ్’ ను దక్షిణాఫ్రికాలో సైంటిస్టులు గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గల గబ్బిలాల్లో ఈ ‘నియో కోవ్’ వైరస్ బయటపడింది. అయితే, ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌ గా గుర్తించారు. కానీ, ఇందులోని ఓ మ్యుటేషన్‌ కారణంగా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

అయితే, తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెవో) స్పందించింది. దీనిపైన మరింత అధ్యయనం అవసరమని తెలిపింది. ఒక ప్రాంతంలోని కొన్ని గబ్బిలాల్లో ఈ వైరస్ ని ఊహాన్ కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తమ దృష్టికి వచ్చిందని డబ్ల్యూహెవో పేర్కొంది. అయితే, ఈ వైరస్ వల్ల మనుష్యులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఇంకా విస్తృత పరిశోధనలు అవసరమని భావిస్తున్నట్లు డబ్ల్యూహెవో తెలిపింది. కాగా, తమ పరిశోధనల ఫలితాన్ని తమతో పంచుకున్నందుకు డబ్ల్యూహెవో.. చైనా శాస్త్రవేత్తలకు కృతఙ్ఞతలు తెలియజేసింది.

అయితే, ఈ ‘నియో కోవ్’ వైరస్‌పై పెను ప్రమాదం పొంచి ఉందని చైనాలోని వూహాన్ సైంటిస్టులు హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ 19తో పోలిస్తే నియో కోవ్ వైరస్ భిన్నమైనది. కరోనా వైరస్‌లో ఉండే పాథోజెన్‌కు భిన్నంగా మరింత ప్రమాదకరంగా ఇది పరిణించే అవకాశాలు లేకపోలేదని సైంటిస్టులు అంచనా వేశారు. యాంటీబాడీలు లేదా ప్రొటీన్లను సైతం నియోకోవ్ నుంచి రక్షణ కల్పించలేదని, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కూడా ఈ వైరస్​ ను ఎదుర్కోలేవని.. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు. అయితే అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ‘నియో కోవ్’ వైరస్ మనుషులకు సోకలేదని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + ten =