ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘అపరిచితులతో ఎలా మెలగాలి?’ అనే అంశం గురించి వివరించారు. కొంతమంది వ్యక్తులు ఎదుటువారితో పోల్చుకుని తమను తక్కువగా భావించుకుంటారని చెప్పారు. అందరూ తమనే చూస్తుంటారనే భావనలో ఉండడం సరైనది కాదని చెప్పారు. సమాజంలో నలుగురితో ఎలా ఉండాలో కన్నా ఎలా ఉండకూడదో నేర్చుకోవాలని సూచించారు. అపరిచితులతో మెలిగే క్రమంలో ప్రత్యేక వ్యక్తిలా కనపడకుండా ఆదర్శంగా తీసుకునేలా, ఆమోదించేలాగా, అనుసరించేలాగా ఒక చక్కని భాషను, బాడీ లాంగ్వేజ్ ను అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఎదుటివారి వద్ద భావాలను వ్యక్తపరిచేందుకు పాటించాల్సిన సూత్రాలను ఈ ఎపిసోడ్లో పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]