శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఓటమిని ఓడించడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా ముందుగా పెట్టుకున్న లక్ష్యాలను సాధించడంలో ఎక్కువమంది విఫలమవుతారని, అందుకు కారణం ఆ స్థాయిలో కృషి చేయకపోవడమేనని అన్నారు. కోరిక వేరు, గమ్యం వేరని ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే కృషి చేయడం అని చెప్పారు. ఓటమిని ఓడించాలంటే సరైన పద్ధతిలో కష్టపడి పనిచేయడం(కృషి) చేయడం ఒక్కటే మార్గం అని పేర్కొన్నారు. మనిషి యొక్క బుద్ధి కృషి చేయమని చెప్తుందని, అలాగే మనసు కోర్కెను పెంచుకునేలా చేస్తుందని అన్నారు. అయితే బుద్ధి చెప్పినట్టు నడుచుకున్నవారే జీవితంలో పైకివస్తారని తెలిపారు. జీవితంలో ఓటమిని ఓడించే దిశగా ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ఈ ఎపిసోడ్ లో ఆయన విశ్లేషణ చేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]