త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్నది ఎవరంటే..?

Cabinet Expansion Soon Who is in the Race,Cabinet Expansion Soon,Who is in the Race,CM Revanth reddy, Congress government, Revanth reddy cabinet, Telangana, Ministers,Mango News,Mango News Telugu,Pressure on Revanth,Revanth for cabinet expansion,Cabinet Expansion Latest News,Cabinet Expansion Latest Updates,Cabinet Expansion Live News,Telangana Latest News,Revanth reddy Live Updates,Telangana Latest News And Updates
CM Revanth reddy, Congress government, Revanth reddy cabinet, Telangana, Ministers

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.  ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఇక ఇప్పటికే మంత్రి వర్గంలో 11 మందికి చోటు కల్పించారు. వారంతా బాధ్యతలు కూడా స్వీకరించారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్‌తో చర్చించేందుకు రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారు.. అలాగే ఓడినవారిలో కొందరు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్నారు. అలాగే అటు సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే.. సార్వత్రి ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈక్రమంలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని పావులు కదుపుతున్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి మైనంపల్లి హన్మంతరావు ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అటు ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈక్రమంలో వీరిద్దరిలో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే మైనంపల్లి హన్మంతరావుకు లోక్ సభ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తోంది. ఈక్రమంలో అంజన్ కుమార్ యాదవ్‌నే మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

అటు నాంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఫిరోజ్ ఖాన్ ఓటమి పాలయ్యారు. ఇటు నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన షబ్బీర్ అలీ కూడా ఓడిపోయారు. ఈక్రమంలో వీరిద్దరిలో ఒకరికి మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వివేక్ బ్రదర్స్‌లో ఒకరికి కేబినెట్‌లో సీటు ఖాయమని సంబంధిత వర్గాలు చెబుతున్నారు. ఈక్రమంలో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కనున్నాయి..? కేబినెట్ ఎలా ఉండబోతోంది..? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =