ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన ఈసీ

EC has Lifted the Suspension of IPS Officer Anjani Kumar,EC has Lifted the Suspension,Suspension of IPS Officer,IPS Officer Anjani Kumar,Election Commission revokes suspension,Mango News,Mango News Telugu,CM Revanth Reddy,Anjani Kumar, EC, Suspension, Revanth reddy,IPS Officer Anjani Kumar Latest News,IPS Officer Anjani Kumar Latest Updates,IPS Officer Anjani Kumar Live News,Anjani Kumar Suspension Updates,Anjani Kumar Suspension Live News,Telangana Latest News And Updates, Telangana Political News And Updates
Anjani Kumar, EC, Suspension, Revanth reddy

తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌కు ఊరట లభించింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఈ మేరకు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ తొలగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. దీంతో అంజనీకుమార్‌ను తిరిగి డీజీపీగా నియమిస్తారా?.. లేదా మరేదైనా పోస్టు ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇకపోతే నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ఆ సమయంలో అంజనీ కుమార్ తెలంగాణ డీజీపీగా ఉన్నారు. అయితే ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే అంజనీ కుమార్ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనల ప్రకారం అంజనీ కుమార్.. రేవంత్ రెడ్డిని కలవకూడదు. కానీ నిబంధనలు అతిక్రమించి ఆయన రేవంత్ రెడ్డిని కలవడంతో.. పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. దర్యాప్తు జరిపి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఫలితాలు వెలువడక ముందే.. రేవంత్ రెడ్డిని కలవడంపై వివరణ ఇవ్వాలని అంజనీ కుమార్‌ను ఈసీ కోరింది. అలాగే అదే రోజున తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమించింది. అదేరోజున రవి గుప్తా తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.

తాజాగా అంజనీ కుమార్.. రేవంత్ రెడ్డిని కలవడంపై ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని.. రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని అంజనీ కుమార్ ఈసీకి వివరించారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చారు. ఈక్రమంలో అంజనీ కుమార్‌ వివరణను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆయనపై సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + eleven =