సోనీ కంపెనీ గురించి తెలియని వాస్తవాలు

Facts About Sony Company, Mango News Telugu, national news headlines today, national news updates 2019, Real Facts About Sony Company, sony company success secreats, Sony Company Unknown Facts, Unknown facts about Sony Company

జపాన్ కు చెందిన బహుళజాతి సమ్మేళిత కార్పోరేషన్ అయిన సోనీ ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలలో ఒకటి. 1946వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అత్యంత ఇష్టంగా మారిన అనేక ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటువంటి దిగ్గజ కార్పొరేషన్ సోనీ గురించి తెలియని కొన్ని వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సోనీ గురించి తెలియని వాస్తవాలు:

  • ఈ సంస్థను రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ సమయంలో మసారు ఇబుకా మరియు అకియో మోరిటా అనే ఇద్దరు టోక్యో ట్సుషిన్ కోగ్యో (టిటికె) అనే సంస్థగా స్థాపించారు. 12 సంవత్సరాల తరువాత కంపెనీ పేరు సోనీగా మారింది. అకియో మొరిటా అమెరికాను సందర్శించిన తరువాత ఇతర దేశస్తులు కంపెనీ పేరును పలకడంలో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
  • సోనీ ఒకప్పుడు రైస్ కుక్కర్‌ను కనిపెట్టగా 100 యూనిట్ల కంటే తక్కువ అమ్మడుపోయాయి. రైస్ కుక్కర్‌ ఆవిష్కరణ కంపెనీకి భారీ వైఫల్యంగా నిలువగా, పూర్తీ స్థాయిలో అభివృద్ధి చేసి, ఈ రంగంలో ఖ్యాతి గడించింది.
  • సోనీ జైలు ఖైదీల కోసం ప్రత్యేకంగా పరికరాలను ఉత్పత్తి చేసింది. అలాంటి ఒక ఉదాహరణ వాక్‌మన్ SRF-39FP.
  • 1998 లో సోనీ విడుదల చేసిన క్యామ్‌కార్డర్ కొంత వివాదానికి కారణమైంది. కామ్‌కార్డర్‌లో ఇన్ఫ్రారెడ్ లైట్ లో చూడగలిగే నైట్ విజన్ మోడ్ విమర్శలు ఎదుర్కొంది. కంపెనీ తన తప్పును చాలా ఆలస్యంగా గ్రహించింది, అప్పటికే దాదాపు 700,000 యూనిట్లను విక్రయించినప్పటికీ వాటిని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.
  • ప్రసిద్ధి చెందిన జపనీస్ ఫ్యాషన్ డిజైనర్ ఇస్సే మియాకే తో సోనీ కంపెనీ ఉద్యోగుల యొక్క యూనిఫాంలను రూపొందించారు. స్టీవ్ జాబ్స్ ధరించే దుస్తుల రూపకల్పన వెనుక ఉన్న వ్యక్తి కూడ ఇస్సే మియాకే.
  • సోనీ కంపెనీ 1950వ సంవత్సరం చివర్లో పాకెట్ రేడియోలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది మరియు అది ప్రపంచంలోని అతిచిన్న రేడియో అని పేర్కొంది. అయితే రేడియోలు చొక్కా జేబుల్లో సరిపోకపోయే సరికి, సోనీ తన ప్రచారానికి అనుగుణంగా రేడియోలు జేబులో కనిపించేలా చేయడానికి, కంపెనీ సేల్స్ మెన్ కోసం పెద్ద జేబులతో కూడిన షర్టులను తయారు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here