బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ తాత్కాలికంగా మూసివేత: కేటీఆర్‌

KTR Says Biodiversity Flyover Will Closed, KTR Says Biodiversity Flyover Will Closed Temporarily, Mango News Telugu, Minister KTR Says Biodiversity Flyover Will Closed, Minister KTR Says Biodiversity Flyover Will Closed Temporarily, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ ఘటనపై తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కారు ప్రమాద సంఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైఓవర్‌ ను తాత్కాలికంగా మూసివేసి వేయాలని, ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణ, రక్షణ చర్యలును స్వతంత్ర నిపుణులు కమిటీతో అధ్యయనం చేయాలని జిహెఛ్ఎంసీ చీఫ్‌ ఇంజినీర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ రోజు జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరో వైపు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ ఘటనపై స్పందిస్తూ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియోను ప్రకటించారు.

వేగ నియంత్రణ చర్యల కోసం మూడు రోజుల పాటు ఈ ఫ్లైఓవర్ పై రాకపోకలు నిలిపివేస్తున్నట్టు జిహెఛ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. అయితే ఫ్లై ఓవర్ కింద వెళుతున్న ఓ మహిళ పై ఆ కారు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని కేర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై స్వల్ప కాలంలోనే రెండోసారి ప్రమాదం చోటు చేసుకుంది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 9 =