వెస్టిండీస్ తో సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, BCCI Announced T20, BCCI Announced T20 And One Day Squads, BCCI Announced T20 And One Day Squads Against West Indies, latest sports news, latest sports news 2019, Mango News Telugu, One Day Squads Against West Indies, sports news

డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 21, గురువారం నాడు ఎమ్మేస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కోల్‌కతాలో సమావేశమై వెస్టిండీస్ తో జరిగే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో మూడు టి20 ఇంటర్నేషనల్స్, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు) మ్యాచ్‌లు భారత్ ఆడనుంది. బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌కోహ్లి వెస్టిండీస్ తో టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. అలాగే గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న పేస్ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి వన్డే, టీ20ల్లో స్థానం సంపాదించాడు. ఫామ్ తో ఇబ్బంది పడుతున్న శిఖర్ ధావన్, విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్ తమ స్థానాలను నిలుపుకున్నారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపికైన కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్ ను తిరిగి ఈ సిరీస్ కు ఎంపిక చేయకపోవడం విశేషం.

టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కె.ఎల్. రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శివమ్‌ ధూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్ సుందర్, చహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్‌ షమి, దీపక్ చాహర్.

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ ధూబే, చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here