2020 సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Govt Releases List Of Public And Optional Holidays List For 2020, Holidays List For 2020, Mango News Telugu, Political Updates 2019, Public And Optional Holidays List For 2020, telangana, Telangana Breaking News, Telangana Govt Releases List Of Public And Optional Holidays List, Telangana Govt Releases List Of Public And Optional Holidays List For 2020, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 21, గురువారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం మరియు రెండో శనివారాలను మినహాయించి ప్రభుత్వ కార్యాలయాలకు 23 రోజుల సాధారణ సెలవులు, మరో 17 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం సెలవుల్లో నాలుగు ఆదివారాలు, ఆరు శనివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. రిపబ్లిక్ డే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి వంటివి ఆదివారం రోజు రాగా, దీపావళి పండుగ మాత్రం రెండో శనివారం నాడు వచ్చింది.

సాధారణ సెలవులు:
పండుగ/పర్వదినం    తేదీ         వారం
కొత్త సంవత్సరం    జనవరి 1    బుధవారం
భోగి                  జనవరి 14  మంగళవారం
సంక్రాంతి            జనవరి 15  బుధవారం
మహా శివరాత్రి       ఫిబ్రవరి 21  శుక్రవారం
హోలీ                 మార్చి 9    సోమవారం
ఉగాది                మార్చి 25  బుధవారం
శ్రీరామ నవమి       ఏప్రిల్‌ 2     గురువారం
గుడ్‌ ఫ్రైడే             ఏప్రిల్‌ 10   శుక్రవారం
అంబేడ్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14  మంగళవారం
రంజాన్‌               మే 25       సోమవారం
రంజాన్‌ మరుసటి రోజు మే 26  మంగళవారం
బోనాలు              జూలై 20    సోమవారం
బక్రీద్‌                  ఆగస్టు 1     శనివారం
శ్రీకృష్ణాష్టమి          ఆగస్టు 11   మంగళవారం
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 శనివారం
వినాయక చవితి      ఆగస్టు 22  శనివారం
గాంధీ జయంతి      అక్టోబరు 2  శుక్రవారం
బతుకమ్మ ప్రారంభం అక్టోబరు 17 శనివారం
దుర్గాష్టమి             అక్టోబరు 24 శనివారం
మిలాద్‌-ఉన్‌-నబి    అక్టోబరు 30 శుక్రవారం
కార్తిక పౌర్ణమి/ గురునానక్‌ జయంతి నవంబరు 30 సోమవారం
క్రిస్మస్‌                  డిసెంబరు 25  శుక్రవారం
బాక్సింగ్‌ డే           డిసెంబరు 26 శనివారం
ఆదివారం/రెండో శనివారం వచ్చిన సెలవులు:
గణతంత్ర దినోత్సవం  జనవరి 26  ఆదివారం
జగ్జీవన్‌రాం జయంతి  ఏప్రిల్‌ 5     ఆదివారం
మొహర్రం              ఆగస్టు 30   ఆదివారం
విజయదశమి          అక్టోబరు 25  ఆదివారం
దీపావళి                నవంబరు 14 2వ శనివారం
ఐచ్ఛిక సెలవులు:
జువన్‌పురి జన్మదినం  జనవరి 10  శుక్రవారం
కనుమ                  జనవరి 16  గురువారం
శ్రీపంచమి               జనవరి 30  గురువారం
షబ్-ఇ-మిరాజ్‌         మార్చి 23   సోమవారం
మహవీర్‌ జయంతి    ఏప్రిల్‌ 6       సోమవారం
షబ్-ఇ-బారాత్‌         ఏప్రిల్‌ 9       గురువారం
బుద్ధ పూర్ణిమ          మే 7          గురువారం
షాదత్‌ హజ్రత్‌ అలీ     మే 14       గురువారం
షబ్-ఇ-ఖదీర్‌           మే 21        గురువారం
జుమాతుల్‌ వాదా      మే 22       శుక్రవారం
రథయాత్ర               జూన్‌ 23    మంగళవారం
వరలక్ష్మీ వ్రతం          జూలై 31    శుక్రవారం
రాఖీ పౌర్ణమి            ఆగస్టు 3     సోమవారం
9వ మొహర్రం          ఆగస్టు 29   శనివారం
ఆర్బయీన్‌            అక్టోబరు 8   గురువారం
యజ్‌ దాహుమ్‌ షరీఫ్‌ నవంబరు 27 శుక్రవారం
క్రిస్మస్‌ ఈవ్‌             డిసెంబరు 24 గురువారం
ఆదివారం వచ్చే ఐచ్ఛిక సెలవు దినాలు:
బసవ జయంతి         ఏప్రిల్‌ 26    ఆదివారం
ఈద్‌-ఇ-ఘదీర్‌          ఆగస్టు 9    ఆదివారం
పార్శీ కొత్త సంవత్సరం  ఆగస్టు 16  ఆదివారం

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 18 =