సిరీస్‌లో కనీసం ఒక డే అండ్‌ నైట్‌ టెస్టు – సౌరవ్ గంగూలీ

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Day-night Tests Series, India To Play Day-night Tests In Every Series, latest sports news, latest sports news 2019, Mango News Telugu, Sourav Ganguly, Sourav Ganguly BCCI President, sports news

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ జట్టు ఆడిన పింక్‌ బాల్‌ టెస్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై కూడా డే/నైట్‌ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆలోచన చేస్తున్నాడు. భారత్ జట్టు ఆడే ప్రతి సిరీస్‌లో కనీసం ఒక డే/నైట్‌ టెస్టు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. తన ఆలోచనలను బోర్డు సభ్యులతో చర్చించి, ఇతర స్టేడియాల్లో కూడా పింక్ బాల్ టెస్టు ఆడించడానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ‘కోల్‌కతాలో జరిగిన పింక్ బాల్ టెస్టుకు హాజరైన క్రీడాభిమానులను చూసి చాలా సంతోషం కలిగింది. పింక్‌ బాల్‌ టెస్టు విజయవంతం కావడం టెస్టు క్రికెట్ కు మంచి పరిణామం. ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడమే తదుపరి లక్ష్యంగా భావిస్తున్నా. అలాగని జరిగే ప్రతీ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్‌ టెస్టు(డే/నైట్) కావాలని నేను కోరుకోవడం లేదు. టెస్టు సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా డే /నైట్‌ పద్దతిలో జరిగితే బాగుంటుంది. ఒక టెస్టు మ్యాచ్ చూడడానికి కేవలం ఐదువేల మందే వస్తే ఏ క్రికెటర్‌ మాత్రం ఆడటానికి ఇష్టపడతాడు. ఈడెన్‌ పింక్ బాల్ టెస్టు తర్వాత ఈ విధానానికి అందరూ సిద్ధమయ్యారని’ గంగూలీ పేర్కోన్నారు. అయితే భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కోల్‌కతాలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ, డే/నైట్‌ టెస్టు విధానం బాగుందని, అయితే ఇవి రెగ్యులర్‌ టెస్టు షెడ్యూల్‌లో భాగంగా ఉండకుండా, ఎప్పుడన్నా ఒకసారి జరిగితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here