ఈ నెల 18న ఉప్పల్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలివన్డే.. 13నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో టిక్కెట్లు – అజారుద్దీన్

Hca President Mohd Azharuddin Says Tickets Will Be Available From Jan 13Th For The 1St Odi Of India Vs New Zealand,Hca President Mohd Azharuddin,India Vs New Zealand,India Vs New Zealand Tickets,Mango News,Mango News Telugu,India Vs New Zealand Tickets,India Vs New Zealand World Cup 2023,India Vs New Zealand 2023 T20,India Vs New Zealand Schedule,India Vs New Zealand T20,India Vs New Zealand Test,India Vs New Zealand Hyderabad Tickets,India Vs New Zealand Upcoming Match,India Vs New Zealand Live,India Vs New Zealand Live Score,India Vs New Zealand 2023,India Vs New Zealand Wtc Final,India Vs New Zealand Live Score 2023,India Vs New Zealand 2Nd Test 2023,India Vs New Zealand Test 2023,India Vs New Zealand Highlights,India A Vs New Zealand A Live Score Today,India Legends Vs New Zealand Legends,Indian Vs New Zealand,India A Vs New Zealand A Today Match

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌కు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మ్యాచ్‌కు సంబంధించి ముఖ్యమైన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18న భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలివన్డే మ్యాచ్ జరుగనుందని, ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

ఇక మ్యాచ్ కోసం టిక్కెట్లు అమ్మకాలు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం లేదని స్పష్టం చేసిన అజారుద్దీన్, కేవలం ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, అది కూడా పేటీఎంలో మాత్రమే లభిస్తాయని వెల్లడించారు. దీనికోసం ఎల్బీ స్టేడియం మరియు గచ్చిబౌలి స్టేడియాల్లో ఏర్పాట్లు చేశామని, ఈ నెల 15 నుంచి 18 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఫిజికల్‌గా వచ్చి టిక్కెట్లు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు ఈ నెల 14న హైదరాబాద్ వస్తుందని, 15న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుందని తెలిపారు. అలాగే భారత జట్టు 16న నగరానికి వస్తుందని, 17న రెండు జట్లూ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాయని, 18న తొలివన్డేలో తలపడతాయని అజారుద్దీన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − five =