బౌండరీల రూల్ పై భారత క్రికెటర్ల విమర్శలు

Cricket fraternity criticise boundary rule after England claim World cup, Cricket World Cup 2019 final Latest News, Cricketers fume at Boundary count Beciding in World Cup, Former cricketers slam ICC for boundary rule, Indian Cricketers Slam Boundary Rule In ICC World Cup Finals, Indian Cricketers Slam ICC for Boundary Count Rule, Mango News

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి, ఇన్నేళ్లకి ప్రపంచ కప్ సాధించింది. అయితే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో, 50 ఓవర్లకి ఇరు జట్ల పరుగులు సమానం కావడంతో టై అవ్వగా, తరువాత నిర్వహించిన సూపర్ ఓవర్ సైతం టై గా ముగియడంతో, న్యూజిలాండ్‌ (16) కంటే ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ (22) జట్టును విజేతగా ప్రకటించారు. ప్రపంచ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీ ఫైనల్లో, ఇలా బౌండరీలు ఆధారంగా విజేతను ప్రకటించడం పై పెను దుమారం జరుగుతుంది. ఈ నిబంధనతో ఆకట్టుకొనే ప్రదర్శన చేసిన న్యూజిలాండ్‌ జట్టుకు అన్యాయం జరిగిందని పలువురు ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు భావిస్తున్నారు.

భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ స్పందిస్తూ, క్రికెట్ లో కొన్ని నిబంధనలపై తీవ్రమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేసారు. మాజీ భారత జట్టు ఓపెనర్ గంభీర్ కూడ తీవ్రంగా స్పందించాడు. బౌండరీలు ఆధారంగా ప్రపంచ కప్ ఫైనల్ విజేతను నిర్ణయించడమేందో అర్ధం కావట్లేదు, ఇది హాస్యాస్పద నియమం, ఫైనల్లో అద్భుతంగా ఆడిన రెండు జట్లకు అభినందనలు అంటూ ట్వీట్ చేసాడు. యువరాజ్ సింగ్ స్పందిస్తూ ‘ ఆ నిబంధనతో ఏకీభవించను, కానీ నిబంధనలు పాటించాల్సిందే. ఎట్టకేలకు ప్రపంచకప్ సాధించిన ఇంగ్లాండ్ జట్టుకు శుభాకాంక్షలు, న్యూజిలాండ్‌ చివరివరకు పోరాడి హృదయాలు గెలుచుకుంది, హోరాహోరీ ఫైనల్ జరిగింది ‘ అన్నాడు. న్యూజిలాండ్‌ మాజీ ఆటగాళ్లు, ఇతర దేశాల ఆటగాళ్లు సైతం ఈ నిబంధన పై తీవ్రంగా స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =