ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి

archer Deepika Kumari, Deepika Kumari becomes top-ranked women’s archer, Deepika Kumari becomes World No 1 archer, Deepika Kumari Of India Ranks World’s No. 1 Archer, Deepika Kumari Of India Ranks World’s No. 1 Archer In Women’s Ranking, Indian Athlete from Ranchi, Mango News, No. 1 archer in women’s ranking list, Sports Authority of India, Sports Authority of India congratulates archer Deepika Kumari, Tokyo Olympics 2020

భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సోమవారం నాడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం దక్కించుకున్నారు. ప్యారిస్‌లో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌-3లో వ్యక్తిగత, జట్టు, మిక్స్‌డ్‌ విభాగాల్లో దీపిక కుమారి హ్యాట్రిక్ స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 2012 లో తొలిసారిగా ఆమె అగ్రస్థానాన్ని సాధించగా, తాజా ప్రదర్శనతో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా దీపిక కుమారి హ్యాట్రిక్ స్వర్ణ పతకాలు సాధించిన అనంతరమే “ఈ ప్రదర్శన సోమవారం నాడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దీపికాను నంబర్ వన్ స్థానానికి తీసుకువెళుతుంది” అని వరల్డ్ ఆర్చరీ సంఘం అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేయడం విశేషం. ఇప్పటివరకు దీపిక ప్రపంచ కప్ లో తొమ్మిది స్వర్ణ, 12 రజత మరియు ఏడు కాంస్య పతకాలను గెలుచుకుంది. అలాగే త్వరలో టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక భారత మహిళా ఆర్చర్ గా దీపిక నిలిచింది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం దక్కించుకున్న దీపికకు పలువురు కేంద్రమంత్రులు, క్రీడాకారులు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =