రామ్ ప్రసాద్ హత్యకు,కోగంటి సత్యమే సూత్రధారి

Businessman ramprasad murder case Mystery Revealed, Industrialist Ram Prasad Murder Mystery Case Solved, Mango News, Police Solved The Murder Case of industrialist Ramprasad, Police Speed up investigation on Ram Prasad And Solved, Ram Prasad Murder Mystery Latest News

ప్రముఖ పారిశ్రామిక వేత్త, స్టీల్ వ్యాపారి రామ్ ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెస్ట్ జోన్ డీజీపీ శ్రీనివాస్ కీలక నిందితులని ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కోగంటి సత్యం, శ్యామ్,ప్రసాద్, ప్రీతమ్,రాములను మీడియా ముందు ప్రవేశపెట్టి, ఈ కేసులో మొత్తం 6 మందికి ప్రమేయముందని తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో రూ. 23 కోట్లు చెల్లించే విషయంలోనే గొడవలు అయ్యాయని, అదే ఈ హత్యకు దారి తీసిందన్నారు. పక్కా పధకం ప్రకారమే కోగంటి సత్యం పురమాయించిన మనుషులు ఈ హత్య చేసారని, అతడే ప్రధాన సూత్రధారి అని, పోలీసులని తప్పుదోవ పట్టించడానికి కోగంటి సత్యం ప్రయత్నం చేసాడని పేర్కొన్నారు.

ఇప్పటికే కోగంటి సత్యం పై 21 కేసులు ఉన్నాయన్నారు, రామ్ ప్రసాద్ ని హతమారిస్తే, వరుసకు బావ అయిన శ్రీనివాస్ భయంతో మిగతా డబ్బులు చెల్లిస్తాడని భావించి, శ్యామ్ ని పురమాయించి, 3 లక్షలు అడ్వాన్స్ కూడ ఇచ్చాడని డీజీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ హత్యకు పథకం పన్ని, దాదాపు నెల రోజులు రెక్కీ నిర్వహించారని, ఈ ఘటనలో మొత్తం ఆరు మారణాయుధాలు ఉపయోగించారని తెలిపారు. కోగంటి సత్యం పై మొదటి నుంచి అనుమానాలు ఉండడంతో, అతని అనుచరుడు శ్యామ్ ని విచారించి పోలీసులు తక్కువ సమయంలో, సంచలనం సృష్టించిన ఈ కేసుని ఛేదించారు.

 

[subscribe]
[youtube_video videoid=VbxUzpkjpc4]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =