భారత్ తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన న్యూజిలాండ్

icc world test championship 2020, India vs New Zealand, India vs New Zealand 2nd Test, India vs New Zealand 2nd Test Match, india vs new zealand live, India vs New Zealand Live Score, Live Cricket Score, Mango News Telugu, New Zealand beat India In 2nd Test, New Zealand Vs India 2nd Test
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ సిటీలోని హాగ్లీ ఓవల్‌ మైదానంలో భారత్ – న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తోలి టెస్టులో కూడా పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెస్టు సిరీస్ ను 2-0తో న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవడంతో భారత్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. గతకొన్ని నెలలుగా టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్లపై అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న భారత్ జట్టు, న్యూజిలాండ్‌ పై ఇలాంటి ఘోరమైన ఓటములకు గురవడంతో క్రీడాభిమానులు నిరాశకు గురయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి అనుభవమున్న ఆటగాళ్లు సైతం న్యూజిలాండ్‌ పర్యటనలో రాణించలేకపోయారు.
ముందుగా 90/6తో సోమవారం నాడు మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ జట్టు మరో 34 పరుగులు మాత్రమే జతచేసి చేసి 124 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట మొదలైన కొద్దిసేపటికే హనుమ విహారి(9), రిషభ్‌ పంత్‌(4) క్యాచ్‌ లు ఇచ్చి వెనుదిరిగారు. అనంతరం మహమ్మద్ షమి(5), జస్ప్రీత్‌ బుమ్రా(4) పెవిలియన్ బాట పట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 124 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా(16*) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్‌బౌల్ట్‌ 4 వికెట్లు, సౌథీ 3 వికెట్లు, గ్రాండ్ హోమ్, నీలం వాగ్నెర్ చెరో వికెట్ తీశారు. ఇక భారత్‌ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (52), టామ్‌ బ్లండెల్‌(55) అర్ధ శతకాలతో రాణించి జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ విలియమ్సన్‌(5) పరుగులకే అవుట్ అయినా, అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్‌ టేలర్‌(5), హెన్రీ నికోల్స్‌(5) విజయానికి అవసరమైన పరుగులు చేశారు. భారత్ బౌలర్లల్లో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాద్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

భారత్ – న్యూజిలాండ్ రెండవ టెస్టు వివరాలు:

భారత్ తోలి ఇన్నింగ్స్: 242-10
హనుమ విహారి (55), పృథ్వి షా (54), పుజారా (54)
జేమిసన్ 5/45, సౌథీ 2/38, బౌల్ట్ 2/89

న్యూజిలాండ్ తోలి ఇన్నింగ్స్: 235-10
టామ్‌ లాథమ్‌ (52), జేమిసన్ (49)
షమీ 4/81, బుమ్రా 3/62

భారత్ రెండవ ఇన్నింగ్స్: 124-10
చటేశ్వర పుజారా(24), బౌల్ట్‌ 4 వికెట్లు
బౌల్ట్ 4/28, సౌథీ 3/36

న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్: 132-3
టామ్‌ లాథమ్‌ (52), టామ్‌ బ్లండెల్‌(55)
జస్ప్రీత్ బుమ్రా 2/39

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here