యూఎస్ ఓపెన్ లో సుమిత్ నగాల్ పై రోజర్ ఫెదరర్ విజయం

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, international news 2019, International News Updates, international sports news, latest sports news, latest sports news 2019, Mango News, Mango News Telugu, Roger Federer wins, Roger Federer wins over Sumit Nagal, Roger Federer wins over Sumit Nagal at US, Roger Federer wins over Sumit Nagal at US Open 2019, sports news

యూఎస్ ఓపెన్ లో తోలి రౌండ్ లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ పై రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన ఈ స్విస్ దిగ్గజం తోలి రౌండ్ లో తోలిసారి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న హరియాణా ఆటగాడు సుమిత్ నగాల్ తో తలపడి 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో గెలుపొందాడు. వరల్డ్ ర్యాంకింగ్స్ లో 190వ స్థానంలో ఉన్న సుమిత్ నగాల్, మూడో స్థానంలో ఉన్న రోజర్ ఫెదరర్ పై తోలి సెట్లో పై చేయి సాధిండం విశేషం. తోలి సెట్లో రోజర్ ఫెదరర్ పై ఆధిక్యత సాధించిన తోలి భారతీయ ఆటగాడిగా సుమిత్ నగాల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

అనంతరం రోజర్ ఫెదరర్ విజృభించడంతో సుమిత్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించలేక పోయాడు, అయితే తన ప్రదర్శన ద్వారా సుమిత్ నగాల్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఫెదరర్ తో ఆట ఆరంభానికి ముందు సుమిత్ నగాల్ మాట్లాడుతూ, ‘ టీవిలో వ్యాఖ్యాతలు నా గురించి చెప్పబోయేదాని గురించి పట్టించుకోను, అత్త్యుత్తమ టెన్నిస్ ప్లేయర్ తో ఆడబోతున్నాను, ఈ రోజు ప్రేక్షకులను ఆస్వాదిస్తాను ‘ అని చెప్పారు. సుమిత్ నగాల్ తన తోలి గ్రాండ్ స్లామ్ పదర్శన తరువాత తన కెరీర్లో అత్యధిక ర్యాంకింగ్ 175 కి ఎదగబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =