నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2020 – రోహిత్ శర్మ సహా ఐదుగురికి రాజీవ్ ఖేల్‌రత్న

National Sports Awards, National Sports Awards 2020, National Sports Awards 2020 Announced, Nomination for National sports Awards 2020, Rohit Sharma and 4 others Gets Rajiv Khel Ratna, Sports Awards, Sports Awards 2020

2020 సంవత్సరానికి గానూ భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్ చంద్ అవార్డులు సహా పలు ఇతర అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. ఈ ఏడాది క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డును ఐదుగురు సొంతం చేసుకోనున్నారు. ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరిలో 8 మంది, రెగ్యులర్ కేటగిరిలో 5 గురు, ధ్యాన్‌చంద్‌ అవార్డులను 15 మంది, అర్జున అవార్డులను 27 మంది సొంతం చేసుకున్నారు. ఆగస్టు 29 న రాష్ట్రపతి భవన్ నుండి వర్చువల్ మోడ్ ద్వారా ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి అవార్డులు అందుకోనున్నారు.

రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న:

 • రోహిత్ శర్మ – క్రికెట్
 • టి. మరియప్పన్ – పారా అథ్లెటిక్స్
 • మణిక బాత్రా – టేబుల్ టెన్నిస్
 • వినేష్ – రెజ్లింగ్
 • రాణి – హాకీ

ద్రోణాచార్య అవార్డు -లైఫ్ టైం కేటగిరి

 • ధర్మేంద్ర తివారీ – ఆర్చరీ
 • పురుషోత్తం రాయ్ – అథ్లెటిక్స్
 • శివ సింగ్ – బాక్సింగ్
 • రోమేష్ పథానియా – హాకీ
 • క్రిషన్ కుమార్ హుడా – కబడ్డీ
 • విజయ్ భల్‌చంద్ర మునిశ్వర్ – పారా పవర్ లిఫ్టింగ్
 • నరేష్ కుమార్ – టెన్నిస్
 • ఓం ప్రకాష్ దహియా – రెజ్లింగ్

ద్రోణాచార్య అవార్డు – రెగ్యులర్ కేటగిరి

 • జూడ్ ఫెలిక్స్ సెబాస్టియన్ – హాకీ
 • యోగేశ్ మాల్వియా – మల్లఖాంబ్
 • జస్పాల్ రానా – షూటింగ్
 • కుల్దీప్ కుమార్ హందూ – వుషు
 • గౌరవ్ ఖన్నా- పారా బ్యాడ్మింటన్

అర్జున అవార్డు:

 • అతను దాస్ – ఆర్చరీ
 • ద్యుతి చంద్ – అథ్లెటిక్స్
 • సాత్విక్ సైరాజ్ రాంకిరెడ్డి – బ్యాడ్మింటన్
 • చిరగ్ చంద్రశేఖర్ శెట్టి – బ్యాడ్మింటన్
 • విశేష్ భ్రిగువాన్షి – బాస్కెట్‌బాల్
 • సుబేదార్ మనీష్ కౌశిక్ – బాక్సింగ్
 • లోవ్లినా బోర్గోహైన్ – బాక్సింగ్
 • ఇశాంత్ శర్మ – క్రికెట్
 • దీప్తి శర్మ – క్రికెట్
 • సావంత్ అజయ్ అనంత్ – ఈక్వెస్ట్రియన్
 • సందేశ్ జింగాన్ – ఫుట్‌బాల్
 • అదితి అశోక్ – గోల్ఫ్
 • ఆకాశ్‌దీప్ సింగ్ – హాకీ
 • దీపిక – హాకీ
 • దీపక్ – కబడ్డీ
 • కాలే సరిక సుధాకర్ – ఖో ఖో
 • దత్తు బాబన్ భోకనాల్ – రోయింగ్
 • మను భాకర్ – షూటింగ్
 • సౌరభ్ చౌదరి – షూటింగ్
 • మాధురికా సుహాస్ పట్కర్ -టేబుల్ టెన్నిస్
 • దివిజ్ శరణ్ – టెన్నిస్
 • శివ కేశవన్ – వింటర్ స్పోర్ట్స్
 • దివ్య కాక్రాన్ – రెజ్లింగ్
 • రాహుల్ అవేర్ – రెజ్లింగ్
 • సుయాష్ నారాయణ్ జాదవ్ – పారా స్విమ్మింగ్
 • సందీప్ – పారా అథ్లెటిక్స్
 • మనీష్ నార్వాల్ – పారా షూటింగ్

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here