గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 49 మందికి నేరచరిత్ర

49 Candidates who have Criminal Cases Contesting in GHMC Elections, Forum for Good Governance, GHMC, ghmc candidates criminal cases, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల బరిలో మొత్తం 150 డివిజన్లకు గానూ 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 49 మంది నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఉన్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. నేర చరిత్ర గల 49 మంది అభ్యర్థుల జాబితాను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేయగా వారిలో బీజేపీ నుంచి 17, టిఆర్ఎస్ నుంచి 13, కాంగ్రెస్ నుంచి‌ 12, ఎంఐఎం నుంచి ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు. కాగా వీరిలో ఆరుగురు మహిళల అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ 49 మందిపై కలిపి మొత్తం 96 కేసులు ఉన్నాయని, వీరంతా మొత్తం 41 వార్డుల్లో పోటీలో ఉన్నారని తెలిపారు. 2016 లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చాయని, ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య తగ్గడం మంచి పరిణామమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + seventeen =