ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాని మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ

Aao-Dhekho-Seekho TRS Working President KTR Open Letter to PM Modi Ahead of Hyderabad Visit, TRS Working President KTR Open Letter to PM Modi Ahead of Hyderabad Visit, KTR Open Letter to PM Modi Ahead of Hyderabad Visit, Minister KTR Open Letter to PM Modi Ahead of Hyderabad Visit, Telangana Minister KTR Open Letter to PM Modi Ahead of Hyderabad Visit, PM Modi Ahead of Hyderabad Visit, PM Modi Hyderabad Visit, Modi Hyderabad Visit, Open Letter to PM Modi Ahead of Hyderabad Visit, Minister KTR Aao-Dhekho-Seekho News, Minister KTR Aao-Dhekho-Seekho Latest News, Minister KTR Aao-Dhekho-Seekho Latest Updates, Minister KTR Aao-Dhekho-Seekho Live Updates, TRS Working President KTR, Minister KTR, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

జూలై 2, 3 తేదీల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ, ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాని మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ విధానాలను అధ్యయనం చేసి అనుసరించాలని లేఖలో పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. “బీజేపీ పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు” అని కేటీఆర్ పేర్కొన్నారు.

“అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-సుపరిపాలన విధానాలు ప్రాధాన్యతలను అధ్యయనం చేయండి. సంక్షేమానికి సరికొత్త అర్ధన్నిచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కళ్యాణ లక్ష్మీ పథకాలతో పాటుగా 450కి పైగా సంక్షేమ పథకాలను స్టడీ చేసి, డబుల్ ఇంజిన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నించండి. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి. మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి” అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =