కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ : మంత్రి సురేష్

Adimulapu Suresh Gives Clarity over Conduct of Tenth and Inter Exams, Andhra Pradesh Board, Andhra Pradesh Tenth and Inter Exams, AP Intermediate Board, AP Tenth and Inter Exams, Education minister Adimulapu Suresh, Mango News, Minister Adimulapu Suresh, Minister Adimulapu Suresh Gives Clarity over Conduct, Minister Adimulapu Suresh Gives Clarity over Conduct of Tenth and Inter Exams, Tenth and Inter Exams In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదని, కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కరోనా నుంచి విద్యార్థులను కాపాడాల్సి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, వారి ఆరోగ్య భద్రతా ప్రధానమని సీఎం వైఎస్ జగన్ చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలు వాయిదా వేశామన్నారు. అయితే పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులకు ఇబ్బంది అని, వారి పైచదువులుకు ఈ మార్కులు ప్రామాణికంగా ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ, ప్రజల్లో లేని భయాందోళనలను సృష్టించడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని, రద్దు చేయాలనే డిమాండ్ సరైనది కాదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + five =