బీఆర్ఎస్ కిసాన్‌ సెల్ అధ్యక్షునిగా గుర్నామ్‌సింగ్‌ చదూని, నియామకపత్రం అందజేసిన సీఎం కేసీఆర్

Gurnam Singh Chaduni Appointed as the President of Kisan Cell of Bharat Rashtra Samithi Party,Gurnam Singh Chaduni,President of Kisan Cell,Bharat Rashtra Samithi Party,Mango News,Mango News Telugu,Gurnam Singh Chaduni,Gurnam Singh Chaduni Twitter,Gurnam Singh Charuni Facebook,Gurnam Singh Chaduni Party,Gurnam Singh Chaduni Election Result,Brs Party,Brs Party By Kcr,Brs Party Flag,Brs Party Symbol,Brs Party India,Trs Brs Party,Brs New Party,Brs Political Party,Brs National Party

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గ్‌ లో బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లెటర్ హెడ్ పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కొన్ని నియామకాలను కూడా సీఎం కేసీఆర్‌ చేపట్టారు.

బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్) ఏర్పాటు చేశారు. భారత్ రాష్ట్ర కిసాన్‌ సమితి అధ్యక్షుడిగా హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన గుర్నామ్‌సింగ్‌ చదూనిని సీఎం కేసీఆర్ నియమించారు. అనంతరం ఈ నియామక పత్రాన్ని గుర్నామ్‌సింగ్‌ కు పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా అందజేశారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయ ఇన్‌చార్జిగా, పార్టీ జనరల్‌ సెక్రటరీగా తమిళనాడుకు చెందిన ఎంపీ రవి కుమార్‌ కోహడును నియమించి, జాతీయ అధ్యక్షుడు హోదాలో వారికీ సీఎం కేసీఆర్ తొలి నియామక పత్రాలను అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =