కౌలు రైతులకు రక్షణ, రైతు సంక్షేమ పథకాల అమలుపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Writes Letter to CM KCR Over Issues of Tenant Farmers in the State, Bandi Sanjay Writes Letter to CM KCR, Bandi Sanjay Writes Letter to CM KCR Over Issues of Tenant Farmers, Tenant Farmers, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Bandi Sanjay Kumar, Telangana BJP President Bandi Sanjay Kumar, Telangana BJP President, Telangana BJP President Writes Letter to CM KCR Over Issues of Tenant Farmers in the State, Tenant Farmers Latest News, Tenant Farmers Latest Updates, Bandi Sanjay Writes Letter to KCR, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకు రక్షణ, ఇతర రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఈ రోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. “రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. వీరిలో సొంత వ్యవసాయ భూమి కొద్ది మందికి ఉండగా ఎక్కువమంది భూమి కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం వెళ్ళదీస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపును కౌలు రైతులు నోచుకోక పోవడంతో వీరికి సాధారణ రైతాంగానికి వర్తించే ఏ సంక్షేమ పథకం అమలు కావడం లేదు. భూమిపై నిజంగా సేద్యం చేసే కౌలు రైతులకు రైతుబంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మి వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం లేదు. వ్యవసాయానికి పంట రుణాలు అందడం లేదు. భూమిపై వ్యవసాయమే చేయని భూయజమానులు రైతుబంధుతో పాటు భూమిపై కౌలు కూడా తీసుకుంటూ, రైతు భీమా సహా ఇతర సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కాయ కష్టం చేసే కౌలు రైతులకు మాత్రం ఈ పథకాలు అమలు చేయకపోవడం సమర్థనీయం కాదు” అని పేర్కొన్నారు.

“భూ యాజమానుల హక్కులకు ఎటువంటి భంగం వాటిళ్లకుండా రాష్ట్రాలు కౌలు చట్టాలలో మార్పులు చేసుకోవాలని 11వ పంచవర్ష ప్రణాళిక పేర్కొన్నది. కౌలు చట్ట సవరణ అంటే భూయజమాని, కౌలుదార్లకు భరోసా కల్పించే విధంగా సవరణలు ఉండాలని ఆ నివేదికలో స్పష్టం చేశారు. కాని రాష్ట్ర ప్రభుత్వం కౌలుదార్లకు ఎటువంటి హక్కులు కల్పించకపోగా వారిని కనీసం రైతులుగా గుర్తించడానికి కూడా నిరాకరించడం గర్హనీయం. పావలా వడ్డీకి కౌలుదార్లకు రుణాలు ఇవ్వవచ్చని నాబార్డు సూచించింది. ఆంధ్రప్రదేశ్ లో సాధారణ రైతాంగానికి వర్తింపజేసే పథకాలను కౌలుదార్లకు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కాని కౌలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్న చిన్న, సన్నకారు రైతులపై తెరాస ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిది. భూమిని సాగు చేసి పంట పండించే వాడే నిజమైన రైతు. అలాంటి రైతుకు బోనస్ సహా ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ సబ్సిడీలన్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే తగు చట్టాలు తీసుకొచ్చి లేదా ఉన్న చట్టాలలో సవరణలు తెచ్చి అయినా కౌలు రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. కౌలు రైతుల సమస్యలపై చర్చించేందుకు రైతు సంఘాలు, మేధావులు, అన్ని రాజకీయపార్టీలతో వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తుంది” అని బండి సంజయ్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here