మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చించేందుకు పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ఎంపీలు

BRS MPs Gives Adjournment Motion in Parliament To Discuss on Womens Reservation Bill,BRS MPs Gives Adjournment Motion,BRS MPs To Discuss on Womens Reservation Bill,Womens Reservation Bill in Parliament,Adjournment Motion in Parliament,Mango News,Mango News Telugu,BRS MPs Move Adjournment Motion,BRS to move adjournment motion,Parliament Live Updates,BRS demands Women's Reservation Bill,Latest News on Adjournment Motion,Womens Reservation Bill Latest Updates,BRS Party,Adjournment Motion News Today,Adjournment Motion Latest News,Telangana Political News And Updates,Telangana News

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ పార్లమెంట్‌ వేదికగా గళం వినిపిస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో ఎంపీలు అభ్యర్థించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత ఈ నెల ప్రారంభంలో (మార్చి 10న) జంతర్ మంతర్ వద్ద ఒక రోజంతా నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అలాగే ఆ తర్వాత కవిత నేతృత్వంలోని భారత జాగృతి సంస్థ న్యూఢిల్లీలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో దాదాపు 15 రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు మరియు వివిధ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిమాండ్‌ను మరింత పెంచేందుకు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో భారత్ జాగృతి త్వరలో ‘మిస్డ్ కాల్ క్యాంపెయిన్’ను ప్రారంభించనుంది. ప్రచారంతో పాటు, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం మరియు ఆమోదించడం గురించి చర్చించడానికి భారతదేశంలోని కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో రౌండ్ టేబుల్ చర్చలు కూడా నిర్వహించనున్నారు. మరోవైపు అదానీ గ్రూపుకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఉమ్మడి పార్లమెంటరీ విచారణకు విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయ సభలు ఆర్థిక బిల్లు 2023ని ఆమోదించడంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో బడ్జెట్ ప్రక్రియ సోమవారం పూర్తయింది. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన తెలుపుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 10 =