ఈపీఎఫ్‌ ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15 శాతం

Central Board Trustees EPF Recommends 8.15 Percent Rate Of Interest To EPF Subscribers For FY 2022-23,Central Board Trustees,EPF Recommends 8.15 Percent Rate Of Interest,EPF Subscribers For FY 2022-23,Central Board Trustees EPF Recommends 8.15 Percent,Mango News,Mango News Telugu,EPFO To Pay 8.15% Rate Of Interest,EPFO Marginally Raises Interest Rate,EPFO Hikes Interest Rate On Pf Balances,Interest Rate On Employees,Cbt EPF Recommends 8.15% Rate Of Interest,EPF Subscribers Latest News,EPF Subscribers Live News,Central Board News Today

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారు అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ సభ్యుల ఖాతాల్లో ఈపీఎఫ్ జమలపై 8.15% వార్షిక వడ్డీని జమ చేయాలని సెంట్రల్ బోర్డ్ సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్‌లో తెలియజేయబడుతుందని, ఆ తర్వాత ఈపీఎఫ్‌ఓ దాని చందాదారుల ఖాతాలలో వడ్డీ రేటును జమ చేస్తుందని తెలిపారు.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్,ఈపీఎఫ్‌ యొక్క 233వ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి, కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి ఆర్తి అహుజా, సభ్య కార్యదర్శి నీలం శమీరావు, సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించారు. గ్రోత్ మరియు మిగులు నిధి రెండింటినీ బ్యాలెన్స్ చేసే మొత్తాన్ని భద్రతను కలిగి ఉండాలని సీబీటి సిఫార్సు చేసింది. సిఫార్సు చేయబడిన వడ్డీ రేటు 8.15 శాతం మిగులును కాపాడుతుంది అలాగే సభ్యులకు ఆదాయాన్ని పెంచుతుందని హామీ ఇస్తుందన్నారు. వాస్తవానికి, వడ్డీ రేటు 8.15 శాతం మరియు 663.91 కోట్ల మిగులు గత సంవత్సరం కంటే ఎక్కువ అని తెలిపారు.

బోర్డు సిఫార్సు ప్రకారం మొత్తం రూ.11 లక్షల కోట్ల ప్రధాన/ప్రిన్సిపల్ మొత్తంపై సభ్యుల ఖాతాలో రూ.90,000 కోట్లకు పైగా పంపిణీ ఉంటుందని చెప్పారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రూ.77,424.84 కోట్లు మరియు రూ.9.56 లక్షల కోట్లుగా ఉందన్నారు. పంపిణీకి సిఫార్సు చేయబడిన మొత్తం ఆదాయం ఇప్పటి వరకు అత్యధికమని, గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఆదాయం మరియు ప్రధాన మొత్తంలో వృద్ధి వరుసగా 16% మరియు 15% కంటే ఎక్కువగా ఉందని చెప్పారు.

“ఈపీఎఫ్‌ఓ సంవత్సరాలుగా తక్కువ క్రెడిట్ రిస్క్‌తో వివిధ ఆర్థిక సైకిల్స్ ద్వారా దాని సభ్యులకు అధిక ఆదాయాన్ని పంపిణీ చేయగలిగింది. ఈపీఎఫ్‌ఓ పెట్టుబడి యొక్క క్రెడిట్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే, ఈపీఎఫ్‌ఓ యొక్క వడ్డీ రేటు చందాదారులకు అందుబాటులో ఉన్న ఇతర పోల్చదగిన పెట్టుబడి మార్గాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ స్థిరంగా పెట్టుబడి పట్ల వివేకం మరియు సమతుల్య విధానాన్ని అనుసరిస్తుంది, జాగ్రత్త మరియు వృద్ధి విధానంతో ప్రిన్సిపల్ యొక్క భద్రత మరియు సంరక్షణపై అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈక్విటీ మరియు క్యాపిటల్ మార్కెట్లలో అస్థిరత ఉన్న కాలంలో కూడా అధిక హామీ ఉన్న వడ్డీ రేటును నిర్వహించడం మరియు దాని చందాదారులకు అందించడం ద్వారా అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ అయిన ఈపీఎఫ్‌ఓ దాని లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ఈపీఎఫ్‌ఓ అనుసరించిన పెట్టుబడి యొక్క సాంప్రదాయిక మరియు ప్రగతిశీల విధానం యొక్క మిశ్రమం పీఎఫ్ సభ్యులకు ఇది తెలివైన ఎంపికగా చేసింది” అని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =