గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీగా అవకాశం

#KCR, breaking news, CM KCR, CM KCR Announces Gutha Sukender Reddy As MLC Candidate, Gutha Sukender Reddy, KCR Announces Gutha Sukender Reddy As MLC Candidate, latest news, Mango News Telugu, Sukender Reddy As MLC Candidate, telangana, Telangana CM KCR, Telangana Political News, Telangana Political Updates, Telangana Politics, TRS, TRS latest news

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో, టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ యాదవరెడ్డి పై అనర్హత వేటు వేసారు. తరువాత క్రమంలో కోర్టును ఆశ్రయించిన కూడ యాదవరెడ్డికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం ఇటీవలే విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఆ స్థానానికి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాల దాఖలు, తదితర ప్రక్రియలో గుత్తా సుఖేందర్ రెడ్డి సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

గత ఎన్నికల సందర్భంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ ఇస్తానంటూ కెసిఆర్ హామీ ఇచ్చారు, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ తరుపున నామినేషన్ వేయాల్సిందిగా సూచించారు. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రగతి భవన్లో శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 7వ తేదీన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో ఎంపీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=qR7UFEx7vOw]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − thirteen =