సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం .. హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి నియామకం

CM KCR Appoints MLC Padi Kaushik Reddy as BRS Incharge For Huzurabad Constituency in Karimnagar,CM KCR Appoints MLC Padi Kaushik Reddy,MLC Padi Kaushik Reddy as BRS Incharge,Huzurabad Constituency in Karimnagar,BRS Incharge For Huzurabad Constituency,Mango News,Mango News Telugu,MLC Padi Kaushik Reddy,CM KCR News And Live Updates,Telangana State CM KCR,MLC Padi Kaushik Reddy Latest News,MLC Padi Kaushik Reddy Latest Updates,MLC Padi Kaushik Reddy Thanked CM KCR,MLC Padi Kaushik Reddy Appointed As Huzurabad BRS,BRS Election Blueprint,BRS Eyes 100 Seats,Huzurabad Constituency Latest Updates,Karimnagar News Today

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవవర్గానికి బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి నియమించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా.. ప్రజల ఆమోదం తనకు ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని, సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని త్వరలో ప్రారంభింపజేస్తామని… ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కూడా గౌరవంగా ఆహ్వానిస్తామని చెప్పారు.

కాగా గతంలోనే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని తానే అని, మంత్రి కేటీఆర్ కూడా దీనిని స్పష్టం చేశారని తెలిపారు. ఇక ఈటల రాజేందర్‌, గతంలో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో సుదీర్ఘకాలం కొనసాగి సీఎం కేసీఆర్‌తో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరిన ఆయన తన రాజీనామా కారణంగా అనివార్యమైన ఉపఎన్నికల్లో 20వేలకు మెజారిటీతో గెలుపొందారు. అప్పటినుంచి హుజూరాబాద్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. దీనిలో భాగంగా తాజాగా ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డిని నియమించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =