కడప పెద్ద దర్గాను సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇఫ్తార్ విందుకు హజరు

TDP Chief Chandrababu Naidu Visited Ameen Peer Dargah in Kadapa and Participated in IFTAR Party,TDP Chief Chandrababu Naidu,Chandrababu Visited Ameen Peer Dargah,Chandrababu Visited Ameen Peer Dargah in Kadapa, Chandrababu Naidu Participated in IFTAR Party,Mango News,Mango News Telugu, TDP Chief Chandrababu Latest NEws,TDP Chief Chandrababu News and Latest Updates, TDP Chief Chandrababu Naidu,Ameen Peer Dargah in Kadapa,Ameen Peer Dargah,Ameen Peer Dargah Latest News

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం కడప పెద్ద దర్గాను సందర్శించారు. ముస్లింలతో కలిసి ప్రార్థన చేసిన ఆయన, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ముస్లిం సోదరులతో కలిసి కడప పెద్ద దర్గాలో రంజాన్ మాస ప్రార్థనల్లో, ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. పవిత్ర రంజాన్ మాస దీక్షలను నిష్ఠగా ఆచరిస్తోన్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. అల్లా దయతో రాష్ట్రానికి మేలు జరగాలి’ అని అన్నారు. ఇక అంతకుముందు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ జోన్-5 నేతలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కేసు ప్రపంచంలోని పోలీసు అధికారులకు ఒక కేస్ స్టడీగా మారుతుందని అన్నారు.

ఇక ఉద్యోగులకు 1వ తేదీన జీతాలే రావడంలేదని, టీడీపీ హయాంలో 5.5 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని, ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం యువతకు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని, ఆర్టీసీ, కరెంటు చార్జీలు పెంచారని చెప్పారు. ప్రజలకు సీఎం జగన్ పాలనపై నమ్మకం పోయిందని, ఈసారి ఎన్నికల్లో టీడీపీ శ్రేణులన్నీ జనంలో ఉంటే పులివెందులలో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా చంద్రబాబు బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మూడు చోట్ల రోడ్డు షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + three =