సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్‌ సిటీలో ఘనంగా వేడుకలు

CM KCR Birthday Celebrations MLC Kavitha Offers Special Puja's at Balkampet Ammavari Temple and Several Ministers Participates at Thrill City Event,CM KCR Birthday Celebrations,MLC Kavitha Offers Special Puja,Balkampet Ammavari Temple,Several Ministers Participates,Thrill City Event,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తన తండ్రి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత అమ్మవారి ఆలయంలో రాజశ్యామల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. పూజల అనంతరం ఎమ్మెల్సీ కవిత ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని తెలిపారు. ఇక బల్కంపేట అమ్మవారి ఆలయం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత పేర్కొన్నారు.

మరోవైపు పీవీ మార్గ్‌లోని సంజీవయ్య పార్క్‌ పక్కన ఉన్న థ్రిల్‌ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిఫ్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, డిఫ్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇక అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే విప్‌ అరికపూడి గాంధీ నేతృత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకొంటున్నారు. అలాగే ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here