మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం సమిష్టిగా కృషి చేయాలి – పార్టీ నేతలతో సీఎం కేసీఆర్

CM KCR Calls Party Leaders Work Together For The Victory of TRS Candidate in Munugode By-Polls, TRS Candidate in Munugode By-Polls, CM KCR Calls Party Leaders Work Together, Munugode By-Polls, Mango News, Mango News Telugu, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం పార్టీ నేతలందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్ రావు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్, ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌లు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన ఆయన కూసుకుంట్ల విజ‌యానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం సీటు ఆశించిన నేతలెవ్వరూ నిరాశకు గురికావద్దని, భ‌విష్య‌త్‌లో రాష్ట్రంతో పాటు జాతీయ‌ రాజ‌కీయాల్లో వారంద‌రికీ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని సీఎం హామీ ఇచ్చారు. కేసీఆర్ పిలుపుకు స్పందించిన ఈ సీనియర్ నేతలు మునుగోడులో కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామ‌ని ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు.

అనంతరం బూర న‌ర్స‌య్య గౌడ్, క‌ర్నె ప్ర‌భాక‌ర్‌లు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో పదవులు, టికెట్లు ఆశించడం తప్పేమీ కాదని, అయితే సందర్భాన్ని బట్టి ఒక్కోసారి సర్దుకుపోవాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని, ఆయన సూచన మేరకు పార్టీ అభ్యర్థి గెలుపుకి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని వారు స్పష్టం చేశారు. కాగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు వచ్చే సోమవారం తర్వాత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 9 =