మానవహక్కుల న్యాయవాది అలెస్ బియాలియాట్స్కీ తో పాటు మరో 2 సంస్థలకు నోబెల్ శాంతి బహుమతి

Belarus Advocate Ales Bialiatski Russia's Memorial and Ukraine's Center for Civil Liberties Win Nobel Peace Prize 2022, Belarus Advocate Ales Bialiatski Win Nobel Peace Prize, Russia's Memorial Win Nobel Peace Prize, Civil Liberties Win Nobel Peace Prize, Ales Bialiatski, Russia's Memorial, Ukraine's Center for Civil Liberties, Mango News, Mango News Telugu, Nobel Peace Prize, Nobel Peace Prize 2022, Nobel Peace Prize Latest News And Updates

2022 సంవత్సరానికి గాను బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాట్స్కీ, రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌ లకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఓ వ్యక్తికి మరియు రెండు సంస్థలను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేరినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన అలెస్ బియాలియాట్స్కీ 1980ల మధ్యలో బెలారస్‌లో ఉద్భవించిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరని పేర్కొన్నారు. అతను తన స్వదేశంలో ప్రజాస్వామ్యం మరియు శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పారు. అతను 1996లో వియాస్నా అనే సంస్థను స్థాపించాడని, రాజకీయ ఖైదీలపై అధికారులు హింస చేపట్టడంపై డాక్యుమెంట్ చేసి నిరసన తెలిపే విస్తృత-ఆధారిత మానవ హక్కుల సంస్థగా వియాస్నా పరిణామం చెందిందని చెప్పారు.

ఇక రష్యన్ మానవ హక్కుల సంస్థ అయిన మెమోరియల్ ను మాజీ సోవియట్ యూనియన్‌లోని మానవ హక్కుల కార్యకర్తలు 1987లో స్థాపించారు. కమ్యూనిస్టు పాలనలోని అణచివేత బాధితులను ఎప్పటికీ మరచిపోలేమని, వారికీ భరోసా ఇవ్వాలని దీనిని స్థాపించారు. ఈ సంస్థ కొత్త నేరాలను నిరోధించడంలో ముందుగా గత నేరాలను ఎదుర్కోవడం తప్పనిసరి అనే భావనతో ఆధారపడి ఉంటుందని, ఈ సంస్థ మిలిటరిజాన్ని ఎదుర్కోవడానికి మరియు మానవ హక్కులు, చట్టబద్ధమైన పాలన ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో కూడా ముందంజలో ఉందని చెప్పారు.

అలాగే సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ ఉక్రెయిన్‌లో మానవ హక్కులు మరియు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో స్థాపించబడింది. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం చేయడానికి మరియు ఉక్రెయిన్ పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంగా మార్చడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఒక స్టాండ్ తీసుకుందని చెప్పారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, ఉక్రేనియన్ జనాభాపై రష్యా యుద్ధ నేరాలను గుర్తించి డాక్యుమెంట్ చేసే ప్రయత్నాల్లో ఈ సంస్థ నిమగ్నమై ఉందని, నేరాలకు పాల్పడిన వ్యక్తులను బాధ్యులను చేయడంలో ఈ సంస్థ మార్గదర్శక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి (డిసెంబర్‌ 10) సందర్భంగా ప్రదానం చేస్తున్నారు. ఇప్పటికే 2022కు గానూ వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య నోబెల్ బహుమతిని ప్రకటించగా, తాజాగా నోబెల్‌ శాంతి బహుమతిని, అలాగే అక్టోబర్ 10న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =