తెలంగాణలో ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

CM KCR Gives Green Signal to Promotions and Transfers of Teachers in Telangana,CM KCR good news for teachers,Telangana teachers,green signal for transfers and promotions,Mango News,Mango News Telugu,Ts Teachers Employee Details,Telangana Teachers Websites,Telangana Teachers Union Website,Telangana Teachers Transfers 2023,Telangana Teachers Salary Slip,Telangana Teachers Salary Scale,Telangana Teachers Pay Scales,Telangana Teachers News,Telangana Teachers List,Telangana Teachers Information Update,Telangana Teachers Info,Telangana Teachers Day,Telangana Teachers,Telangana State Teachers Union Members,Telangana Private Teachers Financial Aid Status,Teacher Salary Telangana,Medical Reimbursement Telangana Teachers

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త అందించారు. ఉపాధ్యాయుల బదిలీలకు, ప్రమోషన్లకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్టు తెలిపారు.

“విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ అందరికి సీఎం కేసీఆర్ శుభవార్త తెలియజేశారు. విద్యా శాఖ తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్స్, ట్రాన్ఫర్స్ కు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేయమని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆదివారం కొంత కసరత్తు చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే చేశామో, వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే ఈ ప్రక్రియ చేపట్టనున్నాం. మొదటగా హెడ్ మాస్టర్స్ కు ట్రాన్ఫర్స్ ఇచ్చిన తరువాత, అంచలవారీగా ప్రమోషన్స్ ఉంటాయి. 9,266 పోస్టులకు సంబంధించిన ప్రమోషన్స్, వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేయమని సీఎం కేసీఆర్ చెప్పారు, త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. అయితే ఇప్పుడు ప్రమోషన్స్, ట్రాన్ఫర్స్ ఇచ్చినప్పటికీ పిల్లలకు సంబంధించి విద్యకు ఇబ్బంది కలగకుండా, పదో తరగతి పరీక్షలు అయిపోయాక ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చేలా ఆదేశాలు ఇవ్వనున్నాం. రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటి తర్వాత మోడల్ స్కూల్స్ కు సంబంధించి కూడా ప్రమోషన్స్ చేపట్టనున్నాం. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా, ఎలాంటి అపోహలకు తావు లేకుండా జరగనుంది” అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =