426 కోట్ల‌తో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌, మరో ఫ్లైఓవ‌ర్ కు జూలై 11న‌ శంకుస్థాప‌న చేయ‌నున్న మంత్రి కేటిఆర్

Elevated Corridor and Flyover, Elevated Corridor and Flyover in Hyderabad, KTR, Minister KTR, Minister KTR Latest News, Minister KTR will Lay Foundation Stone to Elevated Corridor, telangana, Telangana News

హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్‌, మ‌రో ఫ్లైఓవ‌ర్ కు జూలై 11న రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందులో భాగంగా రూ.350 కోట్ల‌తో ఇందిరా పార్కు నుండి వి.ఎస్‌.టి వరకు మొద‌టి ద‌శలో నిర్మించ‌నున్న‌ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జిని నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా మ‌రో రూ.76 కోట్ల‌తో రాంన‌గ‌ర్ నుండి బాగ్‌లింగంప‌ల్లి పేజ్‌-2 సెంక‌డ్ లేవ‌ల్ లో నిర్మించ‌నున్న 3 లేన్ ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిని నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ప‌నుల‌ను 24 నెల‌ల్లో పూర్తి చేయించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ప‌నులు పూర్తైతే ఈ ప్రాంతంలో రాక‌పోక‌లు సాగిస్తున్న వేలాది వాహ‌న‌దారుల‌కు సౌల‌భ్యంగా ఉంటుంద‌ని తెలిపారు. న‌గ‌రాన్ని ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌తో ప‌నులు మంజూరు చేస్తున్న‌ట్లు బొంతు రామ్మోహ‌న్ తెలిపారు.

ఎలివేటెడ్ కారిడార్:

  • ఇందిరా పార్కు నుండి వి.ఎస్‌.టి (ఫేజ్‌-1) వ‌ర‌కు నాలుగు లేన్ల రెండు వైపులా వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనువుగా ఎలివేట‌ర్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం
  • పొడ‌వు: 2.620 కిలోమీట‌ర్లు
  • నిర్మాణ వ్య‌యం: రూ.350 కోట్లు
  • స్ట్ర‌క్చ‌ర్ టైప్ : స్టీల్ బ్రిడ్జి

పేజ్‌-2 సెంక‌డ్ లెవల్ ఫ్లైఓవర్:

  • రాంన‌గ‌ర్ నుండి వ‌యా వి.ఎస్‌.టి ఆజామ‌బాద్ ద్వారా బాగ్‌లింగంప‌ల్లి వ‌ర‌కు ఫ్లైఓవ‌ర్ నిర్మాణం
  • పొడ‌వు: 0.850 కిలోమీట‌ర్లు
  • నిర్మాణ వ్య‌యం: రూ.76 కోట్లు
  • స్ట్ర‌క్చ‌ర్ టైప్ : స్టీల్ బ్రిడ్జి

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − six =