నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం, ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని మోదీ సంతాపం

PM Modi Expressed Deep Grief over the Loss of Lives Due to an Plane Crash in Nepal,Prime Minister Modi Condoles,Modi Condoles Plane Crash In Nepal,Nepal Plane Crash,Mango News,Mango News Telugu,Nepal Plane Crash Tara Air,Nepal Plane Crash 2023,Nepal Plane Crash 2023 Today,Nepal Plane Crash Victims,Nepal Plane Crash 2023,Nepal Plane Crash Indian Family,Nepal Plane Crash Hindi,Nepal Plane Crash 2023 Passenger List,Nepal Plane Crash 2023,Bangladesh Nepal Plane Crash,Recent Nepal Plane Crash,Nepal Plane Crashes,Nepali Plane Crash,Nepalese Plane Crash

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ చెందిన ట్విన్-ఇంజిన్ ఏటీఆర్ 72 విమానం ఖాట్మండు నుండి పోఖారాకు వెళుతుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సహా మొత్తం 72 మంది ఉన్నారు. గత మూడు దశాబ్దాలలో నేపాల్ లో జరిగిన ఈ అత్యంత ఘోర విమాన ప్రమాదంలో 66 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, మరణాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 5 గురు భారతీయులు ఉండగా, నలుగురు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్టు గుర్తించారు

ఈ నేపథ్యంలో నేపాల్‌లో విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. “నేపాల్‌లో జరిగిన విషాద విమాన ప్రమాదంలో భారతీయ పౌరులతో సహా విలువైన ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మరియు ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =