రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతుంది: సీఎం కేసీఆర్

2021 International Youth Day, CM KCR extends greetings on International Youth Day, CM KCR has Greeted Youth in the State on the Occasion of International Youth Day, CM KCR welcomes International Youth Day, International Youth Day, International Youth Day 2021, KCR has Greeted Youth in the State on the Occasion of International Youth Day, Mango News, Telangana CM greets youth on International Youth Day, Telangana CM KCR, Youth Day

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి, బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతుంది: 

యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి వంటి రంగాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని సీఎం అన్నారు. ఉపాధికి అవకాశమున్న టూరిజం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నదన్నారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తున్నదన్నారు. శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమలులోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామన్నారు. వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతున్నదన్నారు. భవిష్యత్ తెలంగాణ యువతదేనని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =