ఎర్ర‌మంజిల్‌ లో 200 ప‌డ‌క‌ల‌ మాతా, శిశు సంర‌క్ష‌ణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హ‌రీశ్‌రావు శంకుస్థాప‌న

Minister Harish rao Laid Foundation for Construction of 200-bed Mother and Child Health Hospital at Erramanzil,Minister Harish rao Laid Foundation For Health Hospital,Minister Harish rao Laid Foundation at Erramanzil,Construction of 200-bed Mother and Child,Mother and Child Health Hospital at Erramanzil,Mango News,Mango News Telugu,MCH Hospital Erramanzil,Minister Harish Rao Speech At MCH 200 Beds,Minister Harish rao Latest News,Minister Harish rao Latest Updates,MCH Hospital Erramanzil Latest News

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు మంగళవారం ఉదయం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రికి అనుబంధంగా ఎర్ర‌మంజిల్‌ లో రూ.55 కోట్లతో నిర్మించే 200 ప‌డ‌క‌ల‌ మాతా, శిశు సంర‌క్ష‌ణ కేంద్రం (ఎంసీహెచ్‌) నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, గ‌తంలో రాష్ట్రంలో మూడు ఎంసీహెచ్ ఆస్ప‌త్రులు మాత్ర‌మే ఉండేవని, రూ.499 కోట్ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్లు ఆ సంఖ్య‌ను 27కు పెంచామని చెప్పారు. రాష్ట్రంలో మాతాశిశు మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టగా, దేశంలో మూడో స్థానంలో ఉన్నామని, మొద‌టి స్థానానికి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ఇక ఎంసీహెచ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌ను తొలిసారిగా హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని అన్నారు.

అదేవిధంగా పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో 100 పడకల డయాలసిస్ యూనిట్ మరియు ఎంఆర్ఐ మెషిన్‌ను, అధునాతన డయాలసిస్ అయిన ఆన్‌లైన్ హీమోడయాలసిస్ సౌకార్యాన్ని కూడా ప్రారంభించారు. ప్రత్యేక యూనిట్‌లో ఆన్‌లైన్ హెచ్‌డిఎఫ్‌ని అందించే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సౌకర్యం దేశంలోనే మొదటిదని తెలిపారు. తెలంగాణ ప్రజలకు సరసమైన మరియు అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ ఇన్‌ఫ్రా అందించడానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇక రోజుకు 500 మంది రోగులకు మరియు మొత్తం 1000 మంది కిడ్నీ రోగులకు సేవలందించే 100 పడకల డయాలసిస్ సౌకర్యంతో ప్రభుత్వంలో కిడ్నీ సంరక్షణను బలోపేతం చేయడం కొత్త ఎత్తుకు చేరుకుందన్నారు. ఒకే ఆసుపత్రిలో 150 మెషీన్లకు చేరడానికి, త్వరలో మరో 50 యంత్రాలు ఈ సౌకర్యానికి జోడించబడతాయన్నారు. దీంతో దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా అత్యధిక సంఖ్యలో హెఛ్డీ యంత్రాలు ఉన్న సౌకర్యంగా ఇది మారుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =