కేసీఆర్ ఎలక్షన్ స్కెచ్‌.. సమంతాను రంగంలో దించే ఆలోచన

CM KCR Plans To Campaign with Tollywood Celebrities For BRS in Telangana Assembly Polls,CM KCR Plans To Campaign with Tollywood Celebrities,Campaign with Tollywood Celebrities,Campaign with Tollywood Celebrities For BRS,BRS in Telangana Assembly Polls,Tollywood Celebrities For BRS in Telangana,Telangana Assembly Polls,Mango News,Mango News Telugu,KCR, election sketch, Samantha,election , Telangana farmers, brand ambassador for handwoven garments, Telangana government, BRS party, CM KCR Latest News,CM KCR Latest Updates,Tollywood Celebrities For BRS News Today,Telangana Assembly Polls Latest News,Telangana Assembly Polls Latest Updates,Telangana Assembly Polls Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News

అపరచాణుక్యుడిగా రాజకీయాలలో అపారమైన పేరు గడించిన కేసీఆర్.. ఎన్నికల వేళ అమలు చేసే వ్యూహాలు ముందుగా మహామహులకు కూడా తెలియవు. రెండు సార్లు సీఎం పీఠాన్ని అధరోహించిన కేసీఆర్.. మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్‌పై కన్నేశారు. దీనిలో భాగంగానే కొన్ని ఎత్తుగడలు వేస్తున్నా.. ఎక్కడో తేడా కొడుతూ వస్తున్నాయి. ఒకేసారి 115 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి బీఆర్ఎస్‌పై మరింత వ్యతిరేకత పెరిగిపోయింది.

ప్రకటించిన అభ్యర్థులపై ఇప్పటికే బోలెడంత నెగిటివిటీ ఉండటంతో ఆ ప్రభావం కేసీఆర్‌పైనా పడింది. ఇంత కంటే మంచివాళ్లు కేసీఆర్‌కు దొరకలేదా? అంతటి రాజకీయవిజ్ఞత ఉన్న ముఖ్యమంత్రి ఈ సారి తప్పులో కాలేసారంటూ ఓపెన్‌గానే అభ్యంతరాలు వినిపించాయి. దీంతో మరోసారి సర్వే నిర్వహించి కొంతమంది అభ్యర్థులను మార్చాలనే బిజీలో పడిపోయారు కేసీఆర్. అయితే ఇప్పుడు మరో ఆలోచనను అమలు చేసి తమ పార్టీకి గ్లామర్ అద్దే పనిలో పడ్డారట సీఎం కేసీఆర్. హీరోయిన్ సమంతను తమ పార్టీ ప్రచారాలలో వాడుకోవాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారట.

ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమా సక్సెస్‌తో దూసుకుపోతూ ఫుల్ జోష్‌లో ఉంది.నిజానికి సామ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. స్టార్ హీరోలతో పోటీ పడేంత రేంజ్‌లో ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉంటారు.సామ్‌కున్న ఈ పాపులారిటీని క్యాచ్ చేసుకునేలా బీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది. సమంతాను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని.. పార్టీ అధినేత సూచనతో ఇప్పటికే కొంతమంది నేతలు సమంతతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అనుసంధానంగా చేసే ఎన్నో కార్యక్రమాలను సమంతా చేస్తూ వస్తోంది. తెలంగాణ రైతులకు సపోర్ట్ చేయడం, చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వంటి కార్యక్రమాలలో సమంత పార్టిసిపేట్ చేసింది. దీనివల్ల కూడా తెలంగాణ ప్రభుత్వంలో సమంతకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు దీనిని క్యాచ్ చేసుకునే.. బీఆర్ఎస్ తమ పార్టీ ప్రచారాలలో కీలకంగా సామ్‌ను తీసుకోవాలని చూస్తున్నారట గులాబీ బాస్.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సమంతాను కలిసిన కొంతమంది నేతలు.. తమ పార్టీకి మద్దతుగా నిలబడాలని.. పార్టీ ప్రచారాల్లో పాల్గొనాలని ఆమెను కోరారట. అయితే.. సమంత మయోసైటిస్‌ ట్రీట్మెంట్ కోసం సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ గ్యాప్‌ను బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని తమ పార్టీ ప్రచారాలలో సామ్‌ను వినియోగించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తల్లో నిజం ఏంటి అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here