దివాలా తీసిన బ్రిటిన్ రెండో అతిపెద్ద నగరం..

UKs Second Largest City Birmingham Declares Itself Bankrupt,UKs Second Largest City Birmingham,Birmingham Declares Itself Bankrupt,Largest City Birmingham Bankrupt,Mango News,Mango News Telugu,Local Self Government Organisation, Britain, second largest city, bankrupt,Birmingham, City Council,Britains second largest city,UKs Second Largest City Bankrupt,City Birmingham Latest News,UK City Birmingham Latest Updates,UK City Birmingham Live News,Birmingham Bankrupt News Today,Birmingham Bankrupt Latest Updates

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశాల్లో ఏమున్నాయి అన్న ప్రశ్న వస్తే అందులో బ్రిటన్ పేరు తప్పకుండా ఉంటుంది. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవు అనడానికి నిదర్శనంగా ఇప్పుడు బ్రిటన్ మారిపోయింది. ఆ దేశం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ అయోమయంలో పడిపోయింది. తాజాగా బ్రిటన్‌ లోని రెండో అతిపెద్ద సిటీ అయిన బర్మింగ్‌హాట్ నగరం కౌన్సిల్ దివాలా తీసినట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకూ సుమారు 10 లక్షల మందికి సర్వీసులు అందించిన ఈ సిటీ కౌన్సిల్.. ఆర్థిక సమస్యల వల్ల సెక్షన్ 144 నోటీస్‌ని ఫైల్ చేసింది. ఇందులో భాగంగానే లైబ్రరీలను మూసివేస్తున్నట్లు… అలాగే కౌన్సిల్ ట్యాక్సులు పెంచనున్నట్టు ఆ ప్రభుత్వం ప్రకటించినట్లు తెలుస్తోంది. అత్యవసరం కాని ఖర్చులను కూడా ఈ కౌన్సిల్ నిలిపివేసింది.

నిజం చెప్పాలంటే.. ఈ బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ ఇన్కమ్ సుమారు 4.3 బిలియన్‌ డాలర్లుగా ఉంటూ వస్తుంది. ఇది ఐరోపాలోనే అతిపెద్ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇదే ఇప్పుడు దివాలా తీయడంతో కౌన్సిల్.. సెక్షన్ 144 నోటీస్‌ని ఫైల్ చేసింది. ఈ సిటీ సమాన వేతన క్లెయిమ్‌లు 956 మిలియన్‌ డాలర్లకు చేరుకోవడంతో..ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు తమకు అదనపు సహాయం అందించాల్సిందిగా.. స్థానిక ‌ గవర్నమెంట్‌ అసోసియేషన్‌‌ను సిటీ కౌన్సిలర్లు కోరారు. దీంతో పాటు.. తమకు అందాల్సిన 1.25 బిలియన్‌ డాలర్ల నిధులను కన్జర్వేటివ్‌ గవర్నమెంట్ లాక్కుందని సిటీ కౌన్సిలర్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ నగరాన్ని ఈ దుస్థితి ఏర్పడటానికి.. ఐటీ సిస్టమ్‌లోని సమస్యలే అంటే ఐటీ కోసం భారీ ఖర్చులు వెచ్చించడం కూడా ఒక కారణమని చెప్పారు.

ఈ ఆర్థిక సంక్షోభం నుంచి సిటీ కౌన్సిల్‌ని బయట పడేయడానికి తమవంతు ప్రయత్నాలను తాము చేస్తామని సిటీ కౌన్సిలర్లు తెలిపారు. తాము చాలా క్లిష్టమైన సవాళ్లని ఎదుర్కొంటున్నా కూడా .. తమ విలువలకు అనుగుణంగా అక్కడ నివసించేవారికి తమ సేవలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అయితే.. బర్మింగ్ హామ్ సిటీ కౌన్సిల్‌కు 2023-24 ఫైనాన్సియల్ ఇయర్‌కు సంబంధించి సుమారు 109 మిలియన్‌ డాలర్లు అవసరం ఉన్నట్లు ఆర్దిక నిపుణలు అంచనా వేశారు. ఈ పరిస్థితిపై బ్రిటన్‌ ప్రధాని కార్యాలయమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ స్పందించారు. బర్మింగ్ హామ్ సిటీ కోసం అదనంగా తాము సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చే డబ్బునే పొదుపుగా..అంటే ప్రస్తుతానికి ఆ బడ్జెట్‌నే లోకల్ గవర్నమెంట్స్ జాగ్రత్తగా వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =