రజనీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ విడుదల, నిన్నటి కంటే మెరుగైన ఆరోగ్యం

Apollo Hospital Released Bulletin on Rajinikanth Health Condition,Rajinikanth Hospitalised,Rajinikanth,Superstar Rajinikanth Hospitalised,Rajinikanth Hospitalised In Hyderabad,Rajinikanth Hospitalized,Rajinikanth Health,Rajinikanth Health Condition,Rajinikanth In Hospital,Superstar Rajinikanth,Superstar Rajinikanth Hospitalized,Rajinikanth Latest News,Rajinikanth At Hospital,Rajinikanth Health Bulletin,Rajnikanth,Rajinikanth Health News,Rajinikanth News,Super Star Rajinikanth,Rajinikanth Health Latest Update,Actor Rajinikanth,Hero Rajinikanth,Apollo Hospital,Apollo,Apollo Hospital Released Bulletin

ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ అస్వస్థతకు గురై హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగుపడిందని తెలిపారు. అలాగే ఆయన రక్తపోటు నిన్నటిమీద మెరుగైన నియంత్రణలో ఉన్నప్పటికీ ఇంకా అధికంగానే ఉందని పేర్కొన్నారు. “ఆయనకు ఈ రోజు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆ రిపోర్టులు సాయంత్రానికల్లా వస్తాయి. రజనీకాంత్ రక్తపోటుకు సంబంధించి అందిస్తున్న వైద్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆయనను వైద్యులు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు. అలాగే ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమైనందున సందర్శకులను ఆయన్ని కలవడానికి అనుమతించడం లేదు. వైద్య పరీక్షలు, రక్తపోటు నియంత్రణ ఆధారంగా రజనీకాంత్ డిశ్చార్జ్‌పై ఈ సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం” అని అపోలో ఆసుపత్రి ఈ రోజు ఉదయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =