తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలి – కేంద్రాన్ని కోరిన సీఎం కేసీఆర్

CM KCR Slams Central Govt Against Paddy Procurement Process in Telangana, Telangana CM KCR Slam Central Govt over Rice Grain Procurement Process in Telangana, CM KCR Slams Central Govt, Paddy Procurement Process in Telangana, Telangana CM KCR Leads To Protest Against Centre in Delhi Over Paddy Procurement Issue, Telangana CM KCR Leads To Protest Against Centre in Delhi, Telangana CM KCR Leads To Protest Against Centre, Telangana CM KCR Leads To Protest Over Paddy Procurement Issue Against Centre in Delhi, TRS Party Protest, TRS Party Protest Against Paddy Procurement Issue, TRS Party Protest Latest News, TRS Party Protest Latest Updates, TRS Party Protest Live Updates, Paddy Procurement Issue, Telangana Paddy Procurement Issue, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Paddy Procurement News, Paddy Procurement Latest News, Paddy Procurement Latest Updates, Paddy Procurement Live Updates, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ వరి సేకరణ విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వరి ధాన్యాన్ని ఒకేరకంగా కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నిరసన కార్యక్రమానికి భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేష్ టికాయత్ కూడా హాజరయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన  నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి టీఆర్ఎస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • ప్రధాని మోదీకి రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను, 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకోండి
  • లేదంటే, కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జలు, రైతులు సిద్ధంగా ఉన్నారు.. రైతులతో పంచాయతీ ప్రభుత్వాలకు మంచిది కాదు
  • ఉద్యమాలు మాకు కొత్త కాదు, ఉద్య‌మాల పోరాట ఫ‌లితంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం
  • ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అమలు రైతులకు మేలు చేయదు, అన్ని రాష్ట్రాలలో ఒకే విధానం అమలు చేయండి
  • దీక్ష‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు వ‌చ్చిన రైతు సంఘ నాయకుడు రాకేశ్ తికాయ‌త్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు
  • మిష‌న్ కాక‌తీయ, మిష‌న్ భగీరథ వంటి కార్యక్రమాలతో తెలంగాణ సస్యశ్యామలం చేసుకున్నాం
  • కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలంగాణ రైతుల‌ను అవమానించటం సంస్కారం కాదు, ఆయన పద్ధతి మార్చుకోవాలి
  • కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తారని దేశమంతా అనుకుంటున్నారు
  • సీఎంను జైలుకు పంపుతామ‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.. నేను సిద్ధంగా ఉన్నాను, తప్పు చేస్తే అరెస్ట్ చేయండి
  • తెలంగాణ రైతాంగం కోసం మేము ఢిల్లీలో ధ‌ర్నా చేస్తుంటే, బీజేపీ నేత‌లు విషయాన్నీ పక్కదారి పట్టించడానికి హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నారు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =