వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

Actor Venu Madhav Health Condition Turns Critical, breaking news, Comedian Venu Madhav Health Condition, Comedian Venu Madhav Health Condition Critical, Comedian Venu Madhav Health Condition Turns Critical, Latest Tollywood Updates 2019, Mango News Telugu, Tollywood Breaking News, Venu Madhav Health Condition Turns Critical

ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు, కిడ్నీ సమస్యలు కూడ తలెత్తడంతో కుటుంబసభ్యులు ఈ నెల 6వ తేదీన యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం నాడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో వేణుమాధవ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు రాజశేఖర్, జీవితా రాజశేఖర్, ఉత్తేజ్ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here