తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

Mango News Telugu, Police Constable Final Results 2019 Released, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Police Constable Final Results 2019 Released, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSLPRB Police Constable Final Results 2019 Released, TSLPRB Police Constable Final Results Released, TSLPRB Police Constable Results 2019 Released

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ఫలితాలు మంగళవారం రాత్రి విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్ సైట్ అయిన www.tslprb.in లో అభ్యర్థుల యొక్క ప్రొవిజినల్ సెలక్షన్ లిస్టును అందుబాటులో ఉంచారు. నోటిఫైడ్ చేసిన మొత్తం 17,156 ఖాళీలలో 13,373 మంది పురుషులు, 2652 మంది మహిళలు కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. ఫలితాలపై ఎవరికైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే వారు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని తెలియజేసారు. వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు రూ.2000 సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. గత కొంత కాలంగా అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తుండడంతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీస్ నియామక మండలి ఫలితాలను విడుదల చేసింది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here