12 రోజుల పాదయాత్రలో తెలంగాణ అంటే ఏంటో అర్ధమైంది, విడిచి వెళ్లడం బాధగా ఉంది – రాహుల్ గాంధీ

Congress Leader Rahul Gandhi Addresses Public Meeting in Kamareddy During Bharat Jodo Yatra Ends in Telangana Today, Rahul Gandhi Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra,Bharat Jodo Yatra, Mango News,Mango News Telugu, Priyanka Gandhi, Rahul Gandhi, Rahul Gandhi Addresses Corner Meeting, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Latest News And Updates, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Meeting In Necklace Road, Rajiv Gandhi, Sonia Gandhi, Telangana Bharat Jodo Yatra

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణలో సోమవారంతో ముగిసింది. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ పాద యాత్రను ముగించిన ఆయన అనంతరం మహారాష్టల్రో ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని మేనూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత 12 రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నానని, ఇక్కడి నేతలతో పాటు ప్రజలతో కూడా మమేకమై మాట్లాడానని తెలిపారు. పాదయాత్రలో తెలంగాణ ప్రజానీకం సమస్యలు తెలుసుకున్నానని, తెలంగాణ అంటే ఏంటో అర్ధమైందని, విడిచి వెళ్లడం బాధగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

మక్తల్ నుంచి మద్నూర్ వరకు చేసిన యాత్రలో తెలంగాణ సమాజాన్ని దగ్గరగా చూసే అవకాశం లభించిందని, తెలంగాణ పోరాట పటిమ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. నాడు కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రం ఏర్పాటు చేసిందని, అయితే నేడు తెలంగాణ ప్రజల కలలను ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కల్లలుగా మార్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఉపాధి కల్పన లేకపోవడంతో నిరుద్యోగ సమస్య, తగిన మద్దతు ధర లభించక రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, అలాగే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 14 =