తెలంగాణ రాష్ట్రంలో మరో 1771 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 12, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,02,089 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 1,20,525 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 13 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3469 కి పెరిగింది. కరోనా నుంచి మరో 2384 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,76,487 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1771):
- జీహెచ్ఎంసీ ఏరియా – 171
- నల్గొండ – 157
- ఖమ్మం – 149
- భద్రాద్రి కొత్తగూడెం – 107
- మేడ్చల్ మల్కాజిగిరి – 104
- కరీంనగర్ – 99
- సూర్యాపేట – 86
- రంగారెడ్డి – 85
- పెద్దపల్లి – 82
- మహబూబాబాద్ – 73
- వరంగల్ అర్బన్ – 64
- మంచిర్యాల – 57
- సిద్దిపేట – 50
- మహబూబ్ నగర్ – 50
- జగిత్యాల – 44
- జయశంకర్ భూపాలపల్లి – 42
- సంగారెడ్డి – 40
- యాదాద్రి భువనగిరి – 36
- రాజన్న సిరిసిల్ల – 36
- వనపర్తి – 35
- ములుగు – 33
- వరంగల్ రూరల్ – 27
- నాగర్ కర్నూల్ – 25
- వికారాబాద్ – 25
- నిజామాబాద్ – 21
- జోగులాంబ గద్వాల్ – 21
- జనగామ – 15
- మెదక్ – 11
- నారాయణ్ పేట్ – 9
- ఆదిలాబాద్ – 7
- కొమరం భీం ఆసిఫాబాద్ – 5
- నిర్మల్ – 3
- కామారెడ్డి – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ