తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : 66,95,297 వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Covid Vaccination in Telangana: 6695297 Vaccine Doses were Administered Till Now

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 6, ఆదివారం రాత్రి 10 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 66,95,297 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 52,59,171 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 14,36,126 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. కాగా ఆదివారం నాడు 1,15,167 మందికి మొదటి డోస్, 4399 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో జూన్ 6 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,47,837
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,90,362
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,53,605
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 98,792
  • 45 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 40,62,314
  • 45 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 11,47,172
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 6,95,415
  • మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 66,95,297

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fourteen =