తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు (కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్చి 5, శుక్రవారం నాటికీ రాష్ట్రంలో 347,985 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 1,59,857 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి మొత్తం 5,35,472 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా కరోనా వ్యాక్సిన్ వేయబడుతుందని తెలిపారు. అలాగే శనివారం నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మార్చి 5 న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ వివరాలు(7 PM వరకు):
- 60 ఏళ్లు పైబడినవారు, కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు):
–> 251 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు: 11377
–> 140 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు: 10449 - హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1208
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 6480
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 405
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 11
తెలంగాణలో మార్చి 5 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,01,371
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,63,448
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 99,023
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 42
- 60 ఏళ్లు పైబడినవారు, కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారు (మొదటి డోసు): 71,588
- మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 5,35,472
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ